»   » షూటింగ్ లో షారూఖ్ ఖాన్ కి పెద్ద ప్రమాదం, ఇప్పుడు క్షేమమే కానీ...

షూటింగ్ లో షారూఖ్ ఖాన్ కి పెద్ద ప్రమాదం, ఇప్పుడు క్షేమమే కానీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తృటిలో పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో నుంచి షారుక్ ఎలాంటి గాయాలు లేకుండా బ‌య‌ట‌ప‌డినా.. ఇద్ద‌రు షూటింగ్ సిబ్బందికి మాత్రం చిన్న గాయాల‌య్యాయి.

సీలింగ్ ఊడి ప‌డింది

సీలింగ్ ఊడి ప‌డింది

షూటింగ్ చేస్తున్న గ‌ది సీలింగ్ హ‌ఠాత్తుగా ఊడి ప‌డింది. షారుక్ కూర్చున్న సీటు ద‌గ్గ‌ర్లోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. షారుక్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల పాటు షూటింగ్‌ను ఆపేశారు. వ‌చ్చే వారం నుంచి మ‌ళ్లీ మొద‌లుపెడ‌తారు అని ముంబై మిర్ర‌ర్ ప‌త్రిక వెల్ల‌డించింది.

అనుష్క‌శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్

అనుష్క‌శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్

ఈ సినిమాలో షారుక్ స‌ర‌స‌న అనుష్క‌శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ మ‌రుగుజ్జుగా, అనుష్క మాన‌సిక స్థితి స‌రిగా లేని యువ‌తిగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. జ‌బ్ త‌క్ హై జాన్ త‌ర్వాత ఈ ముగ్గురూ క‌లిసి న‌టిస్తున్న రెండో సినిమా ఇది.

భిన్న పాత్రలతో ప్రయోగాలు

భిన్న పాత్రలతో ప్రయోగాలు

కొంత కాలం నుంచీ బాక్సాఫీస్‌ ఫలితాలతో నిమిత్తం లేకుండా భిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌. ఒక సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ (రయీస్)గా కనిపిస్తే, ఇంకో సినిమాలో సినీ హీరో వీరాభిమాని (ఫ్యాన్‌)గా, మరో సినిమాలో హీరోయిన్‌ ప్రేమకథను సఫలం చేయడానికి యత్నించే డాక్టర్‌ (డియర్‌ జిందగీ)గా కనిపించాడు.

ఆనంద్‌ ఎల్‌. రాయ్‌

ఆనంద్‌ ఎల్‌. రాయ్‌

ఇప్పుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహించే సినిమాలో మరుగుజ్జు అవతారమెత్తనున్నాడు. ఆ పాత్ర కోసం తనను తాను సమాయత్తం చేసుకుంటున్నాడు. ఇందులో షారుఖ్‌ జోడీగా కట్రీనా కైఫ్‌ నటించనున్నది. వాళ్లు కలిసి నటించిన తొలి చిత్రం ‘జబ్‌ తక్‌ హై జాన్‌' విజయవంతం కావడంతో, ఈ సినిమా ప్రకటన వెలువడినప్పట్నించీ ప్రేక్షకుల్లో కుతూహలం పెరిగిపోతూ వస్తోంది.

విచిత్ర సోదరులు

విచిత్ర సోదరులు

‘విచిత్ర సోదరులు' చిత్రంలో కమల్‌హసన్‌ మరుగుజ్జుగా కనిపించి, మెప్పించారు. ఆ పాత్రను ఆయన ఎలా చేశారబ్బా!.. అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ పాత్ర పోషణ కోసం కమల్‌ చాలా కష్టపడ్డారు. అయితే ఇప్పుడంత కష్టం షారుఖ్‌ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఇప్పుడు అత్యాధునిక వీఎఫెక్స్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

నిజమైన మరుగుజ్జుగా చూపించేందుకు

నిజమైన మరుగుజ్జుగా చూపించేందుకు

దాని సాయంతో షారుఖ్‌ను నిజమైన మరుగుజ్జుగా చూపించేందుకు డైరెక్టర్‌ ఆనంద్‌ ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ రూ. 150 కోట్లను కేటాయిస్తున్నదని సమాచారం. ఇక వీఎఫెక్స్‌ వర్క్‌ కోసం షారుఖ్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని వీఎఫెక్స్‌ టీం పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

తన రేంజ్ సక్సెస్ కోసం

తన రేంజ్ సక్సెస్ కోసం

ఒకప్పుడు వరుస హిట్స్ తో తిరుగులేని హీరో అనిపించుకున్న స్టార్ షారూఖ్. కానీ ఇప్పుడు తన రేంజ్ సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య వచ్చిన ఫ్యాన్ అతి ధారుణమైన పరాజయాన్ని చవి చూసింది. అటు చూస్తే సల్మాన్ అమీర్లు సక్సెల తో దూసుకు పోతున్నారు.

రొటీన్ సినిమాలతో లాభం లేదని

రొటీన్ సినిమాలతో లాభం లేదని

సుల్తాన్, దంగల్ లాంటి సినిమాలు వారిని షారూఖ్ నుంచి వేరు చేసి చూపిస్తున్నారు. ఇదంతా చూసి ఇక రొటీన్ సినిమాలతో లాభం లేదని అనుకున్నాడో ఏమో కానీ, ఎవరూ ఊహించని విధంగా ప్రయోగాత్మక రోల్ పోషించేందుకు రెడీ అయ్యాడట!దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కి బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఉంది.

హ్యాపీ భాగ్‌ జాయేగీ

హ్యాపీ భాగ్‌ జాయేగీ

ఆయన చిత్రాలు సహజత్వానికి చాలా దగ్గరగా నవ్యతతో ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్‌ మను', 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలను 'కలర్‌ ఎల్లో' బ్యానర్‌పై నిర్మించారు. ఆయన నిర్మాతగా తాజాగా 'హ్యాపీ భాగ్‌ జాయేగీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే షారూఖ్‌ఖాన్‌ నటించబోయే ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు..

English summary
According to Mumbai Mirror, a large portion of a ceiling collapsed on the Film City sets of Anand L Rai’s next starring Shah Rukh Khan injuring two crew members.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu