»   »  ఈసారి అవార్డు రాకుంటే ఏడ్చేస్తా: షారుక్ ఖాన్

ఈసారి అవార్డు రాకుంటే ఏడ్చేస్తా: షారుక్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షారుక్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం 'ఫ్యాన్' శుక్రవారం విడుదలై బాక్సాఫీసు వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకెలుతోంది. ఈ చిత్రంలో షారుక్ ద్విపాత్రాభినయం చేసాడు. షారుక్ నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

కాగా...ఇటీవల ఇండియా టీవీ ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. "ఈ సారి నాకు అవార్డు రాకుంటే, అవార్డునే దొంగిలిస్తా... లేకుంటే ఏడ్చేస్తా" అని వ్యాఖ్యానించాడు. తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షారుక్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.

Shah Rukh Khan: If I don't win award for 'Fan', I will snatch it away

యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో ఆదిత్య చోప్రా ఈ చిత్రాని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ డబల్ రోల్ చేసారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్.

సినిమా కథ విషయానికొస్తే....ఆర్యన్‌ ఖన్నా(షారుఖ్‌ ఖాన్‌) దేశంలోనే అత్యంత అభిమానగణం ఉన్న హీరో. 19 ఏళ్ల గౌరవ్‌(షారుఖ్‌ ఖాన్‌) అతనికి ప్రపంచంలోనే గొప్ప అభిమాని. విశేషం ఏమిటంటే ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఆర్యన్‌ ఫొటోలు.. ఫ్లెక్సీలతో తన ఇంటినే ఓ ఆల్బమ్‌లా మార్చేస్తాడు ఆ 'ఫ్యాన్‌'. ఒక్క మాటలో చెప్పాలంటే తన అభిమాన హీరోనే అతని ప్రపంచం!

ఓ రోజు ఎలాగైనా ఆర్యన్‌ను కలవాలని ముంబయిలోని అతని ఇంటికి వెళతాడు గౌరవ్‌. అతన్ని చూసి ఆర్యన్‌ ఉద్వేగానికి గురవుతాడు. దాంతో ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. అనుకోకుండా ఆ అనుబంధం తెగిపోయి.. ఇద్దరి మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. ఆర్యన్‌కు ఉన్న మంచిపేరును చెడగొడతానని గౌరవ్‌ శపథం చేస్తాడు. దీంతో అప్పటి వరకూ తన అభిమాన నటుడిని అభిమానించిన గౌరవ్...ఇపుడు అతనికే శత్రువుగా మారుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.

English summary
SRK said, "If I do not get award this time for my role in Fan, I will snatch away the award, or start crying."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X