»   » సినిమా ప్రమోషన్ కి వెళ్తూ గాయాలపాలయ్యాడు: హీరోకి ఆ గాయాలు ఎలా అయ్యాయి?

సినిమా ప్రమోషన్ కి వెళ్తూ గాయాలపాలయ్యాడు: హీరోకి ఆ గాయాలు ఎలా అయ్యాయి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్ . షారూఖ్ ఖాన్ గ‌తంలో క‌న్నా ఇప్పుడు త‌న చిత్రానికి భారీ ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నాడు. ఆగ‌స్ట్ 4న విడుద‌లైన ఈ చిత్రంలో అనుష్క శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించింది.

ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేందుకు షారూఖ్ కోల్ క‌తా కి వెళుతుండ‌గా స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డాడ‌ట‌. దీంతో షారూఖ్ కోసం వేచి ఉన్న మీడియా ప్ర‌తినిధుల‌కి కాల్ చేసి.. ఆల‌స్యానికి క్ష‌మించండి, నేను గాయ‌ప‌డ్డాను, డ్రెస్సింగ్ చేయించుకొని వ‌స్తాను అని చెప్పాడ‌ట‌. తాను చెప్పిన‌ట్టుగానే షారూఖ్ గాయంతో ప్ర‌చార కార్య‌క్ర‌మానికి కాస్త ఆల‌స్యంగా హాజ‌ర‌య్యాడ‌ట‌. మ‌రి ఆ గాయం ఎలా జ‌రిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 Shah Rukh Khan injures back on his way to Kolkata

అయితే ఇంతగా ప్రమోషన్ చేస్తున్నా సినిమా కలెక్షన్లు నిరాశ పరిచాయి. దేశ వ్యాప్తంగా తొలి రోజు రూ. 15.25 కోట్లు వసూలు చేసింది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న షారుఖ్‌ ఖాన్‌కు ఇది మింగుడు పడని విషయం. షారుఖ్‌, అనుష్క శర్మ జంటగా ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. పంజాబ్‌ టూర్‌ గైడ్‌ హారీ, గుజరాతీ యువతి సెజల్‌ మధ్య సాగే ఈ రొమాంటిక్‌ చిత్రం తొలి రోజు కలెక‌్షన్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్ చిత్రంలో పంజాబ్ వ్య‌క్తి హారీ క్యారెక్ట‌ర్ లో షారుఖ్ న‌టించ‌గా... గుజరాతీ అమ్మాయి సెజ‌ల్ గా అనుష్క న‌టించింది. ఈ చిత్రం పూర్తిగా ప్రేమ‌, జీవితం, అబ‌ద్దం, థ్రిల్, ఫ్రీడం, ఫాంట‌సీ లాంటి అంశాల నేప‌థ్యంలో రూపొందింది.

Shahrukh Khan summoned by ED over foreign exchange violation | Oneindia News
English summary
Bollywood actor injured his back recently while travelling to Kolkata for a promotional event for Imtiaz Ali’s Jab Harry Met Sejal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu