»   »  ఫ్లాప్ డైరెక్టర్‌తో ధూమ్ 4.. సల్మాన్ రిజెక్ట్.. షారుక్ ఒకే..

ఫ్లాప్ డైరెక్టర్‌తో ధూమ్ 4.. సల్మాన్ రిజెక్ట్.. షారుక్ ఒకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ధూమ్ 4 చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం. ధూమ్ 4 చిత్రంలో హీరో గా నటించేందుకు షారుఖ్, యాష్ చోప్రా ఫిలింస్ మధ్య జరిగిన చర్చలు ఈ మధ్య సఫలమైనట్లు తెలిసింది. ధూమ్ 3లో అమీర్ ఖాన్ చేసిన తర్వాత ఈ చిత్రంలో హీరోగా సల్మాన్ లేదా షారుఖ్‌లో ఎవరో ఒకరైతే బాగుంటుందని యష్ రాజ్ ఫిలింస్ భావించిందట. ఆ మేరకు వారిని సంప్రదించారు కూడా. అయితే సల్మాన్ నిరాకరించడంతో ఆ అవకాశం షారుక్ ఖాన్‌కు దక్కినట్టు సమాచారం.

సల్మాన్ నిరాకరణ..

సల్మాన్ నిరాకరణ..

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రేస్3లో నటిస్తున్నారు. ఆ చిత్రం కథ కూడా ధూమ్ 4 తరహాలో ఉంటుందట. అందుకే ఆ సినిమాను చేయడానికి నిరాకరించాడట. ఈ నేపథ్యంలో ధూమ్ 4 చిత్రంలో హీరోగా షారుఖ్ ను నిర్మాణ సంస్థ ఎంపిక చేసింది. ఈ చిత్రంలో హీరో పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఎక్కువట. దాంతో ఈ పాత్రకు షారుక్ అయితే సరిపోతాడని భావించారనేది తాజా సమాచారం.

విలన్‌గా షారుక్

విలన్‌గా షారుక్

గతంలో బాజీగర్, డర్, డాన్, రాయిస్ చిత్రాల్లో షారుఖ్ విలన్ గా నటించారు. ఈ చిత్రాల్లో షారుక్ అద్భుతంగా నటించి సినీ విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా... సదరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాష్ చోప్రా ఫిలింస్.. ధూమ్ 4లో షారుఖ్ ను హీరోగా నిర్ణయించింది.

ఆదిత్య, మనీష్ కథ..

ఆదిత్య, మనీష్ కథ..

కాగా ఈ చిత్రానికి కథను యాష్ చోప్రా ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా .... మనీష్ శర్మ అందించారు. ఈ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ధూమ్ 3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకుడు అనుకొన్నారు. అయితే సాధ్యపడే అవకాశం లేదు.

 దర్శకుడు మారే అవకాశం.

దర్శకుడు మారే అవకాశం.

ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఈ చిత్రానికి దర్శకుడు మారే అవకాశం ఉందని సమాచారం. ఓ వేళ ఈ చిత్రానికి మనీషే దర్శకత్వం వహించే అవకాశం లేక పోలేదని బాలీవుడ్ లో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.

షారుక్‌తో మళ్లీ

షారుక్‌తో మళ్లీ

మనీష్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే వారి మధ్య ఉన్న రిలేషన్ వల్ల మరో సినిమా చేయాలని అప్పట్లో అనుకొన్నారు. అయితే ఇప్పుడు ధూమ్ 4తో వారి కోరిక నిజమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఆదిత్య నిర్ణయం తీసుకొంటే ఈ చిత్రానికి మనీష్ దర్శకుడు అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నది.

English summary
Shah Rukh Khan is the chosen one for Dhoom 4 has been in the news for over a year. While it may have been a conversation between the actor and Yash Raj Films at the time, or wishful thinking on part of his fans, it’s now beginning to look like a plan. After Aamir Khan in Dhoom 3, it had to be either SRK or Salman to maintain the star power of the series. Since Salman is already doing another action franchise Race 3, SRK is the perfect choice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu