»   » వేలానికి షారుక్ గీసిన అరుదైన పెయిటింగ్.. ధర కూడా సూపర్‌.. అద్భుత చిత్రం మీకోసం..

వేలానికి షారుక్ గీసిన అరుదైన పెయిటింగ్.. ధర కూడా సూపర్‌.. అద్భుత చిత్రం మీకోసం..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటుడే కాదు.. ఆయనలో మరో కోణం కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఫ్యాన్స్ పర్యటనకు వెళ్లిన షారుక్ తాను చూసిన ప్రదేశాలను ఊహించుకొంటూ తనలోని చిత్రకారుడిని తట్టిలేపాడు. మదిలోని ఊహలకు గీత రూపం కల్పించి ఓ పెయింటింగ్‌ను రూపొందించారు. ఎన్నో ఏళ్ల క్రితం గీసిన పెయిటింగ్ జూన్ 22వ తేదీన ఓసియాన్స్ ది గ్రేట్ ఇండియన్ షో అన్ ది ఎర్త్ 2లో వేలం నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ ఊహలకు ప్రతిరూపమైన పెయింటింగ్‌ లక్షల రూపాయల ధర పలికే అవకాశం ఉంది.

 Shah Rukh Khan’s 1997 doodle to be auctioned.

1997లో షారుక్ రూపొందించిన డూడల్‌ ఓ రేంజ్ లేకపోయినా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఆ గీసిన డూడల్‌లో ఈఫిల్ టవర్ తదితర చిత్రాలను రూపొందించారు. ఫ్రాన్స్ అందాలను ఆయనలోని కళాకారుడు చక్కగా వ్యక్తీకరించాడు అని పలువురు కితాబిచ్చారు. ఈఫిల్ టవర్‌ను ఎక్కే ఓ అమ్మాయిని కాపాడే సన్నివేశాన్ని కూడా షారుక్ చక్కగా గీసారు. ఆయనలో మంచి గైడ్ కూడా ఉన్నారని, ఆ చిత్రంలో ఫ్రాన్స్ మొత్తం కనిపించిందని పలువురు పేర్కొనడం గమనార్హం.

 Shah Rukh Khan’s 1997 doodle to be auctioned.

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న జబ్ హ్యారీ మెట్ సెజల్ అనే చిత్రంలో ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా అనుష్క శర్మ కనిపిస్తారు. ఇదే కాకుండా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కె చిత్రంలో చిత్రంలో కూడా షారుక్ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ జంటగా నటిస్తారు.

English summary
Shah Rukh Khan's doodle from 1997 doodle, back is said to go for an auction for no less than a lakh rupees at Osian's The Greatest Indian Show On Earth 2 on June 22. The black and white scribbling is a funny take on what SRK thinks about France with little captions to explain all his sketches.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu