»   » షారూఖ్ ప్యాన్స్ కు దూరదర్శన్ గిప్ట్ , నిజంగా అద్బుతమైనదే

షారూఖ్ ప్యాన్స్ కు దూరదర్శన్ గిప్ట్ , నిజంగా అద్బుతమైనదే

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలీవుడ్ లో బాద్ షాగా పేరు తెచ్చుకున్న హీరో షారూఖ్ ఖాన్. మొదట బుల్లి తెరపై 'సర్కస్' అనే సీరియల్ ద్వారా పరిచయం తర్వాత వెండి తెర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. షారూఖ్ వెరైటీ మ్యానరీజంతో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక దశలో నెం.1 హీరో స్థాయికి ఎదిగిపోయాడనే సంగతి షారూఖ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు.

అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటే...బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ తొలి రోజుల్లో చేసిన స‌ర్క‌స్ సీరియ‌ల్ ను దూరదర్శన్‌ పునః ప్రసారం చేయ‌ాలని నిర్ణయించుకుంది. అజీజ్‌ మీర్జా, కుందన్‌స షా దర్శకత్వంలో 1980 చివరలో ప్ర‌సార‌మై బహుళ ప్రజాదరణ పొందిన సీరియ‌ల్ 'సర్కస్'. ఈ నెల 19 నుంచి రాత్రి ఎనిమిది గంటలకు డీడీ నేషనల్‌ లో ఈ సీరియ‌ల్ ను టెలీకాస్ట్‌ చేయనుంది.


1980 లలో దూరదర్శన్ లోని కొన్ని సీరియల్స్ లో నటిస్తూ ఖాన్ తన వృత్తి ని ప్రారంభించాడు. 'సర్కస్' సీరియల్ తో బుల్లితెర వీక్షకులను అలరించిన షారుక్ ఖాన్ 'ఫౌజీ' సీరియల్ తో తారాపథంలో దూసుకుపోయారు. దీవానా (1992) చిత్రంతో సినీ ఆరంగ్రేటం చేశారు. ఆ తర్వాత వచ్చిన డర్ బాజీఘర్ చిత్రాలు అతనిలోని నటుడ్ని తెరపై ఆవిష్కరించాయి.

ఇక ఈ విషయమై ఈ సీరియల్ లో షారూఖ్ కు లవర్ గా చేసిన రేణు సహాని... తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.


ఇక షారూఖ్ ఖాన్ కి గత రెండు సంవత్సరాల నుంచి టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయిన 'రాయిస్' చిత్రం సూపర్ హిట్ టాక్ రావడంతో షారూఖ్ మళ్లీ లైన్లో పడ్డాడనే చెప్పాలి. ఇప్పటికే సల్మాన్, అమీర్ ఖాన్ ల సినిమాలు మూడు వందల కోట్ల క్లబ్ లో చేరగా షారూఖ్ ఖాన్ చిత్రం రాయిస్ 200 వదల కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక రాయిస్ - కాబిల్ చిత్రాల మద్య పోటీ నడుస్తున్నా..షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది.
రాహుల్‌ దోలాఖియా దర్శకత్వంలో వచ్చిన 'రాయిస్‌' చిత్రంలో షారూక్ నెగిటీవ్ షేడ్స్ లో నటించి మరోసారి తన సెంటిమెంట్ వర్క్ ఔట్ చేసుకున్నాడు.
వాస్తవానికి రాయిస్ చిత్రానికి నెగెటివ్ రిపోర్ట్ లు వచ్చాయి కానీ వాటికీ భిన్నంగా వసూళ్లు వస్తుండటం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది .

English summary
Before Shah Rukh Khan became the Badshah of Bollywood he made a name for himself in the television industry. He starred in many shows like Fauji and Circus. Well, now there is some good news for all SRK fans. Doordarshan National revealed on their Twitter handle that SRK's Circus will be retelecasted from February 19, 2017 at 8 pm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu