»   » షారుక్ కూతురు నైట్ పార్టీలో దుమ్ము రేపింది.. సుహానా ఫొటోలు ఇవే..

షారుక్ కూతురు నైట్ పార్టీలో దుమ్ము రేపింది.. సుహానా ఫొటోలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, శ్రీదేవి లాంటి ప్రముఖుల పిల్లలు ఇంకా సినీ పరిశ్రమలో ప్రవేశించకుండానే సెలబ్రీటీలుగా మారారు. ముంబై నైట్ పార్టీలలో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. శ్రీదేవి కూతురు జాహ్నవి ఇప్పటికే పార్టీలు, పబ్బులు, బాయ్‌ఫ్రెండ్స్ లాంటి వ్యవహారాలతో దుమ్ము రేపుతున్నది. అమితాబ్ మనవరాళ్లు కూడా తామే తక్కువ కాదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వీరికి తోడుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు సారా కూడా పార్టీ కల్చర్‌తో జోష్‌లో ఉన్నది. ఇటీవల షారుక్ కూతురు సుహానా ముంబైలో నైట్ పార్టీ వేడుకను పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం.

ఫ్రెండ్స్‌తో సుహానా జల్సా

ఫ్రెండ్స్‌తో సుహానా జల్సా

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా (16) తన స్నేహితులతో కలిసి నైట్ పార్టీలో జల్సా చేసింది. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీడియాకు వారు ఇచ్చిన ఫోజులపై నెటజిన్లు పలు రకాల కామెంట్లు పెట్టారు.

గ్రాడ్యుయేషన్ తర్వాతే..

గ్రాడ్యుయేషన్ తర్వాతే..

సుహానా బాలీవుడ్‌లోకి ప్రవేశించడానికి పయత్నిస్తున్నది. సినీ నిర్మాణం, యాక్టింగ్‌కు సంబంధించిన విద్యను ప్రస్తుతం అభ్యసిస్తున్నారు. ఇటీవల షారుక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎవరైనా గానీ కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అనేది నా అభిప్రాయం.

థియేటర్‌ స్టడీస్‌పై దృష్టిపెట్టాలని..

థియేటర్‌ స్టడీస్‌పై దృష్టిపెట్టాలని..

నా కూతురుకు కూడా అాదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్‌పై ఆసక్తి ఉంటే థియేటర్ స్టడీస్‌పై దృష్టి పెట్టమని సుహానాకు సూచించా. కాలేజి విద్యను పూర్తి చేయి. ఆ తర్వాత రెండేళ్లు యాక్టింగ్ కోర్సు చేయాలని చెప్పా అని అన్నారు.

నటనపై అవగాహన తప్పనిసరి..

నటనపై అవగాహన తప్పనిసరి..

ఒకవేళ తను సినీ పరిశ్రమలోకి రావాలంటే అంత కష్టమేమీ కాదు. ఇప్పటికే నేను ఈ పరిశ్రమలో ఉన్నాను. సినీరంగంలోకి ప్రవేశించాలనే ఆలోచన ఉన్నప్పుడు దానికి గురించి తెలుసుకోవాలన్నది నా అభిప్రాయం. నటనపై అవగాహన ఉన్న తర్వాతనే తెరపైకి రావాలి. నా పాపులారిటీ కారణంగా ప్రేక్షకులు ఆదరించరు. స్వయంగా కెపాసిటీ ఉండాలి అని షారుక్ చెప్పారు.

English summary
Photos of Suhana Khan chilling with her friends are doing the rounds online. Shah Rukh Khan's daughter Suhana takes a break from everything else once in a while and just lets her hair down with her friends. A photo of Suhana surfaced on social media where she can be seen chilling with her squad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu