»   » నాన్నా నావేలు విరిగింది చూడు..?? టాప్ స్టార్ కొడుకు క్యూటెస్ట్ వీడియో

నాన్నా నావేలు విరిగింది చూడు..?? టాప్ స్టార్ కొడుకు క్యూటెస్ట్ వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్‌రామ్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటాడు. అబ్‌రామ్ ను గతంలో మీడియాకు వీలైనంత దూరంగా ఉంచిన షారుక్ ఇపుడు మాత్రం అతన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నాడు.

తాను వెళ్ళే ప్రతీ ప్రోగ్రామ్ కీ వెంట పెట్టుకెళ్తున్నాడు. సర్రోగసీ పద్దతిలో మూడో సంతానాన్ని పొందిన సంగతి తెలిసిందే. మే 27, 2013లో 13న జన్మించిన ఈ బిడ్డకు అబ్ రామ్ అనే పేరు పెట్టారు. ఈ బిడ్డ విషయంలో అప్పట్లో వివాదం చెలరేగింది. లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించినట్లు వచ్చిన వార్తలను షారుక్ ఖండించిన విషయం తెలిసిందే..

Shah Rukh Khan's Son AbRam Adorably Crashes Interview

ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇటీవల రయీస్ చిత్ర ప్రమోషన్లలో భాగం గా షారుక్‌ పాల్గొన్న ఫేస్‌బుక్‌ లైవ్‌ చాట్‌ కోసం అబ్రామ్ ని కూడా తీసుకొచ్చాడు. అక్కడే అల్లరి చేస్తూ తిరుగుతున్న అబ్రాం షారుక్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో దూరంగా నిల్చొని గట్టిగా "డాడీ.. నా వేలు విరిగింది చూడు" అంటూ అరవటం తో

ఇంటర్వ్యూ మధ్యలో ఆపిన షారూఖ్. కుమారుడిని ఇలారా అని పిలిచి వేలికి ముద్దు పెట్టి.. 'ఇప్పుడు తగ్గిపోయిందా?' అని అడిగాడు. కెమెరా ముందుకు వచ్చిన అబ్రామ్‌ని అక్కడున్న వారు పలకరించి ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు బై చెప్పు అని సూచించారు. అయితే అబ్రామ్‌ మాత్రం కెమెరా వైపు తిరిగి మళ్లీ తండ్రితో ముచ్చటిస్తూ ఉండిపోయాడు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్స్‌ సోషల్‌మీడియా ద్వారా దీన్ని షేర్‌ చేస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Shah Rukh Khan, known for his candid conversations, has captured everyone's hearts yet again or should we say, his son has? This time, the Bollywood Badshah was seen in probably the cutest conversation with his youngest son AbRam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu