»   » విడుదల కాకముందే కీలక సీన్ నెట్లో: హిట్ కాదుకదా యావరేజ్ కూడా కష్టమేనట

విడుదల కాకముందే కీలక సీన్ నెట్లో: హిట్ కాదుకదా యావరేజ్ కూడా కష్టమేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హీరోగా వస్తున్న తాజా సినిమా 'ట్యూబ్‌లైట్‌'.. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌ 'సుల్తాన్‌' తర్వాత.. 'బజరంగీ భాయ్‌జాన్‌' దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో 'ట్యూబ్‌లైట్‌' తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యూబ్ లైట్

ట్యూబ్ లైట్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రతి ఈద్ సీజన్లో తన సినిమా రిలీజ్ చేస్తుంటాడు. తాజాగా ఆయన నటించిన 'ట్యూబ్ లైట్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్‌గా రిలీజైంది. సల్మాన్ ఖాన్‌కు ఇంతకు ముందు ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్ లాంటి సూపర్ హిట్లను అందించిన కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సోహైల్ ఖాన్

సోహైల్ ఖాన్

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బేనర్లో స్వయంగా సల్మాన్ ఖానే నిర్మించడం మరో విశేషం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ రోజు ఉదయం 9 గంటలకే సినిమా రిపోర్ట్ ఏమిటో బయట పెట్టాడు.

సినిమా పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉంది

సినిమా పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉంది

వన్ వర్డ్ లో రివ్యూ రాశారు. సినిమా పూర్తిగా డిసప్పాయింటింగ్ గా ఉందని తేల్చేశారు. సల్మాన్ ఖాన్ లాంటి సాలిడ్ స్టార్ పవర్, స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నాయని... అయితే ట్యూబ్ లైట్ బాడీ ఎంతో అందంగా ఉన్నా సోల్(ఆత్మ) మిస్సయింది అంటూ చెప్పారు. దాంతో ఎంతో పెద్ద సినిమా అవుతుందనుకున్న ట్యూబ్ లైట్ క్రేజ్ సగానికి సగం పడిపోయింది. అంతే కాదు ఈ సినిమాకి గుండేకాయలాంటి సీన్ కూడా విడుదలకంటే ముందే నెట్ లో ప్రత్యక్షమైపోయింది...

కీలక సీను ఆన్‌లైన్‌లో లీక్

కీలక సీను ఆన్‌లైన్‌లో లీక్

వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న సల్మాన్‌ఖాన్‌, 'ట్యూబ్‌లైట్‌'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అనుకుంటున్న సమయంలో, 'ట్యూబ్‌లైట్‌' సినిమా మీద వస్తున్న రిపోర్ట్ అందర్నీ విస్మయానికి గురిచేసింది. మొత్తానికి సల్మాన్‌ నుంచి భారీ హిట్‌ ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్ర యూనిట్‌ కు షాక్‌ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సీను ఆన్‌లైన్‌లో లీకవ్వడమే కాదు.. అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.

షారుఖ్‌ ఖాన్‌

షారుఖ్‌ ఖాన్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఇంద్రజాలికుడిగా కనిపించి పిల్లలను అలరించే కీలక సీన్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయింది. ఈ సీన్‌ అభిమానులను అలరిస్తుండటంతో వెంటనే వైరల్‌గా మారింది. ఇంతకీ, 'ట్యూబ్‌లైట్‌', 'దంగల్‌'ని దాటుతుందా.? హిందీ వెర్షన్‌ 'బాహుబలి'ని 'ట్యూబ్‌లైట్‌' టచ్‌ చేయగలుగుతుందా.? అన్న ప్రశ్నలకి సమాధానం దొరికేసినట్టే ఇప్పటి రిపోర్ట్ ప్రకారం ట్యూబ్ లైట్ ఈ రెండు సినిమాలని అందుకోవటం కూడా అనుమానమే.

English summary
Shah Rukh Khan's cameo in Tubelight was one of the highlights of Salman Khan's film. However, some scenes have been leaked from the cameo appearance of Jab Harry Met Sejal actor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu