For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కిరీటం, కొమ్ములతో పర్వతంపై ... ఫ్యాన్స్ పండుగ (వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : కొత్త తరహా సాంకేతికతను తన సినిమాలకు ఉపయోగించుకోవడానికి షారుఖ్‌ ఖాన్‌ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఆయన ఓ యానిమేషన్‌ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు. 'అథర్వ ది ఆరిజన్‌' అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈ యానిమేషన్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే ప్రకటన చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో షారుఖ్‌ గెటప్‌ చాలా కొత్తగా ఉంది. ఇది చూసిన అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేస్తున్నారు.

  కండలు తిరిగిన దేహంతో కొమ్ములతో చేసిన కిరీటం పెట్టుకొని ఓ పర్వతంపై నిల్చొని కనిపిస్తాడు. ప్రాచీన కాలానికి చెందిన ఓ రాజు తన జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడనేదే ఈ నవల. కొద్ది మార్పులు మినహా యథాతథంగా ఈ నవలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. షారుఖ్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌పైనే ఈ సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం.

  ఇక రీసెంట్ గా షారూఖ్ ...హ్యాపీ న్యూ ఇయిర్ చిత్రంతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం ఆయన స్నేహితురాలు ఫరాఖాన్ డైరక్ట్ చేసింది. పెద్ద హిట్ టాక్ కాకపోయినా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుంది.

  Shah Rukh Khan turns into majestic warrior for graphic novel ‘Atharva – The Origin’

  హ్యాపీ న్యూ ఇయిర్ కథేమింటే.... మూడు వందల కోట్ల విలువైన వజ్రాలను ఓ ఇండిస్ట్రియలిస్ట్ చరణ్ గ్రోవర్(జాకీ ష్రాఫ్) నుంచి చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ ఛార్లీ(షారూఖ్) కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తమకు సహకరించే ప్రొఫిషనల్స్ తో కూడిన ఓ టీమ్ కావాల్సి వస్తుంది. ఆ టీమ్ లో ...నందూ భిఢే(అభిషేక్ బచ్చన్),జాక్(సోనూ సూద్), మోహిని(దీపిక),రోహన్(వివాన్ షా), టామీ(బొమన్ ఇరానీ)లను ఎంపిక చేస్తాడు.

  అక్కడ నుంచి వారందరినీ తీసుకుని తన ప్లాన్ ప్రకారం...దుబాయి లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్ కు వెళ్తాడు. ఆ పోటీ హడావిడిలో అందరూ ఉండగా... ఆ వజ్రాలను లేపేయటానికి స్కెచ్ వేస్తాడు. ఎందుకు చార్లీ ఇలా దొంగతనానికి సిద్దపడ్డాడు..ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి... అనుకున్నట్లుగా అక్కడ వజ్రాలు దొరికియా...వంటి సమధానాలు తెలియాలంటే... 'హ్యాపీ న్యూ ఇయర్‌' చూడాల్సిందే. ఆరుగురు దొంగ డ్యాన్సర్లు చేసే సందడే ఈ చిత్రం.

  English summary
  ” Atharva – The Origin” is a new age graphic novel project by Virzu Studios featuring Shah Rukh Khan as the titular character. The novel is based on a very young earth, in a time long forgotten, a prospective king makes a difficult and lone journey . ‘Atharva’ chronicles that journey, taking it’s hero and you on an awe inspiring journey encountering magnificent lands and strange beasts – a true treat for the soul
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X