»   »  మరియప్పన్ తంగ వేళు ఇతని పేరుని మీరు మర్చిపోయే ఉండొచ్చు... ఇక మర్చిపోరు

మరియప్పన్ తంగ వేళు ఇతని పేరుని మీరు మర్చిపోయే ఉండొచ్చు... ఇక మర్చిపోరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తంగవేలు మరియప్పన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది ఇంతకీ ఎవరీ మరియప్పన్ పేరు ఎక్కడో విన్నట్టు ఉన్నా సరిగ్గా గుర్తు రావటం లేదు కదూ.. మరియన్ తంగవేలు చిన్నప్పుడే వికలాంగుడయ్యాడు. ఐదేళ్ల వయస్సున్నప్పుడు ఓ బస్ యాక్సిడెంట్ లో అతడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో... అతడు చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ ఈవెంట్స్ పై దృష్టిపెట్టాడు. హైజంప్ ప్రాక్టీస్ చేశాడు. రియోలో జరుగుతున్న పారాలింపిక్స్ కు ఎంపికయ్యాడు. పారాలింపిక్స్ హైజంప్ ఈవెంట్ లో... భారత్ కు ఏకంగా బంగారు పతకం సాధించిపెట్టాడు.

పారాలింపిక్స్‌లో 2016 సెప్టెంబర్‌ 11న జరిగిన పురుషుల హైజంప్‌ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలు స్వర్ణ పతకం సాధించాడు, దీంతో ఒలిపింక్స్‌లో భారత్‌ నుంచి హైజంప్‌ విభాగంలోస్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్‌ సింగ్‌ భటి కాంస్యం సాధించాడు, తంగవేలు 189 మీ.ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 186 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్‌గ్రెవే (186) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు.

 మరియప్పన్ పేరుతో:

మరియప్పన్ పేరుతో:


తంగవేలు మరియప్పన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. మరియప్పన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ విడుదల చేశారు.

జాతీయ హీరో కథ :

జాతీయ హీరో కథ :


మన జాతీయ హీరో కథ ఇదని ఆయన పేర్కొన్నారు. స్వర్ణం సాధించే క్రమంలో దివ్యాంగుడైన తంగవేలు ఎదుర్కొన్న సంఘర్షణకు తెరరూపంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి వేల్‌రాజ్ ఛాయాగ్రహణం, సీన్‌రోల్డన్ సంగీతం, ప్రసన్న జి.కె ఎడిటింగ్ అందిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న తొలి క్రీడాకారుడి బయోపిక్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఐశ్వర్య ధనుష్:

ఐశ్వర్య ధనుష్:

మరియప్పన్ జీవిత కథను సినిమాగా తెరకెక్కించడానికి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సెట్స్ పైకి కూడా వెళ్ళిపోయిన ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా స్వయంగా ఐశ్వర్య ధనుష్ దీనిని నిర్మిస్తుండటం విశేషం.

 షారుక్ ఖాన్:

షారుక్ ఖాన్:


ఇకపోతే, ఈ గ్రేట్ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా షారుక్.. భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనని, ఐశ్వర్య ధనుష్ కు ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చాడు.

 తంగవేళు స్పందిస్తూ:

తంగవేళు స్పందిస్తూ:


మరోవైపు, ఐశ్వర్య ధనుష్ ఈ సినిమాను.. ‘ఈ ప్రపంచం నువ్వు చేయలేవు అని ఆలోచించొచ్చు.. కానీ నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తావ్ అనేదే ముఖ్యం' అనే క్యాప్షన్ తో తెరకెక్కిస్తున్నట్లు చెప్పి అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక తాజాగా తన జీవిత కథతో సినిమా వస్తుండటంపై మరియప్పన్ తంగవేళు స్పందిస్తూ.. నా జీవితంపై ఓ సినిమా వస్తుందని నేనస్సలు ఊహించలేదని, ఇది నాకు చాలా గొప్ప విషయమని అన్నారు.

English summary
Filmmaker Aishwarya Dhanush Rajinikanth's next Tamil directorial will be a biopic on Indian Paralympic high jumper Mariyappan Thangavelu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu