మనుసు దోచుకొన్న షారుక్.. అబ్‌రామ్‌తో కలిసి..
తన సర్రోగసి కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి షారుక్ ఖాన్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొన్నారు. ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో తండ్రి కొడుకులు ప్రార్థనలు చేశారు.
బాలీవుడ్ బాద్షా మరోసారి అభిమానులను ఆకట్టుకొన్నారు. తన సర్రోగసి కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొన్నారు. ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో తండ్రి కొడుకులు ప్రార్థనలు చేశారు. వీటికి సంబంధించిన చిత్రాలను షారుక్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకొన్నారు.

'శ్రీ దర్బార్ సాహిబ్ వద్ద ప్రార్థనలు చేశాం. శాంతిని, ప్రేమను కోరుకొన్నాం. అది అద్భుతమైన ఫీలింగ్. థాంక్యూ అమృత్‌సర్' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గతనెల 25వ తేదీన షారుక్ నటించిన రయీస్ చిత్రం విడుదలైంది. గుజరాత్ నేపథ్యంగా ఈ చిత్రంలో లిక్కర్ డాన్ గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించపడుతున్నది.

shah rukh khan abram golden temple amritsar raees షారుక్ ఖాన్ అబ్రామ్ స్వర్ణ దేవాలయం అమృత్ సర్ రయీస్


Click it and Unblock the Notifications