నాని 4-5 టైమ్స్ ఎడిపించేశాడు.. అబద్ధమని తెలిసినా తట్టుకోలేకపోయా: బాలీవుడ్ హీరో

టాలీవుడ్ హీరో నాని ఎలాంటి సినిమా చేసినా కూడా నటన అనేది చాలా నేచురల్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిజజీవితంలో ఒక పక్కింటి అబ్బాయి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. అందుకే ఓ వర్గం వారు అతన్ని ఎక్కువగా అభిమానిస్తారు. రియల్ లైఫ్ లో కూడా వివాదాల జోలికి ఎక్కువగా వెళ్లకుండా చాలా సరదాగా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. అయితే ఇటీవల ఒక బాలీవుడ్ హీరో నాని తనను ఎడిపించేశాడు అంటూ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

మొహం మీదే కౌంటర్ ఇచ్చాడు

మొహం మీదే కౌంటర్ ఇచ్చాడు


నేచురల్ స్టార్ నాని కెరీర్ మొదటి నుంచి కూడా కామెడీ లవ్ స్టోరీలను ఎక్కువగా ట్రై చేశాడు. ప్రయోగాలు చేసింది చాలా తక్కువ. ఎక్కువగా ప్రేమ కథలను టచ్ చేయడంతో దర్శకుడు రాజమౌళి చాలాసార్లు మొహం మీదే కౌంటర్ ఇచ్చాడు. కాస్త డిఫరెంట్ గా యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు చేయమని హెచ్చరించాడు.

డిఫరెంట్ కామెడీ యాంగిల్

డిఫరెంట్ కామెడీ యాంగిల్

అయితే చాలామంది దర్శకులు నానిని ఎక్కువగా రెగ్యులర్ గానే చూపించే ప్రయత్నం చేశారు. మధ్యలో చేసిన పైసా, జెండాపై కపిరాజు డినిమాలు విభిన్నమైన సినిమాలే అయినప్పటికీ కథలో మ్యాటర్ లేకపోవడం వలన నాని పెద్దగా హిట్ అందుకోలేకపోయాడు. భలే భలే మగాడివోయ్ పెద్దగా ప్రయోగం కాకపోయినా నానిలోని మరో డిఫరెంట్ కామెడీ యాంగిల్ ని భయటపెట్టింది.

రెండు మూడు సన్నివేశాలతోనే

రెండు మూడు సన్నివేశాలతోనే

ఇక నాని జీవితంలో ఎన్ని సినిమాలున్నా కూడా జెర్సీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు అందులో కేవలం రెండు మూడు సన్నివేశాలతోనే తన టాలెంట్ ఏమిటో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ సినిమాను నాని కంటే ఎవరూ బాగా చేయాలరేమో అనేంతలా నటించాడు.

నాలుగైదు సార్లు కంటతడి

నాలుగైదు సార్లు కంటతడి

ఇక బాలీవుడ్ లో ఆ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని జెర్సీ రీమేక్ చేయడానికి షాహిద్ కపూర్ సిద్ధమయ్యాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ నాని జెర్సీలో నటించిన విధానం నాలుగైదు సార్లు కంటతడి పెట్టించినట్లు చెప్పాడు. సన్నివేశం నిజం కాదు అబద్దమని తెలిసినా కూడా కన్నీళ్లు అగలేదని అన్నాడు. ఇక 'నా జీవితంలో కూడా 40ఏళ్ళు వచ్చే వరకు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఒక విధంగా తన రియల్ లైఫ్ కు జెర్సీ చాలా దగ్గరి కథ. అందుకే రీమేక్ చేస్తున్నాను' అని షాహిద్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X