»   » షాక్: కొడుకు వరుసయ్యే వ్యక్తితో హీరోయిన్ ‘సం’బంధం!

షాక్: కొడుకు వరుసయ్యే వ్యక్తితో హీరోయిన్ ‘సం’బంధం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమాల్లో కొత్తదనం పేరుతో రకరకాల కథాంశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఈ కథలు సామాన్య సమాజం ముక్కున వేలేసుకునేలా, ఈసడించుకునేలా ఉంటున్నాయి. తాజాగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'హైదర్' అనే చిత్ర కథలో వివాదాస్పద అంశం జోడించారు.

విశాల్ భరద్వాజ్ దర్శకుడిగా షాహిద్ కపూర్ కథానాయకుడిగా నిర్మిస్తున్న 'హైదర్' సినిమాలో హీరోకి పిన్నిగా నటిస్తుంది టబు. కథ రీత్యా ఇందులో షాహిద్ తల్లి పాత్ర చనిపోతుంది. దాంతో అతని తండ్రి టబుని రెండో వివాహం చేసుకుంటాడు. ఈ క్రమంలో టబు కొడుకు వరుసయ్యే షాహిద్ పై మనసు పారేసుకుంటుంది.

Shahid Kapoor, Tabu to romance in Vishal Bharadwaj's Haider?

పాత్ర వైవిద్యంగా ఉండటంతో వెంటనే చేయడానికి తన అంగీకారం తెలిపింది టబు. అంతే కాదు.... ఇలాంటి పాత్రలు చేయడం వల్లనే నటిగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి కష్టమైన పాత్రలు చేసినపుడే కెరీర్ పరంగా మంచి పేరు వస్తుంది అంటోంది టబు.

ఇక టబు అభిమానులకు మరో శుభవార్త. ఈ చిత్రంలో ఆమె చాలా చాలా గ్లామరస్‌గా కనిపించబోతోంది. నలభైఏళ్లు దాటినా నవనవలాడుతూ శృంగార దేవతలా మెరిసి పోతున్న టబు.....ఈ చిత్ర ద్వారా అభిమానులకు అందాల విందు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటన్నారు సినీ విశ్లేషకులు.

English summary
Bollywood is trying hard to get new concepts to the screen, and Vishal Bharadwaj's upcoming film Hiader is no different. The film starring Shahid Kapoor in the lead will bring a romantic angle in light between Shahid's character and Tabu, who plays his stepmother.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu