twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుఖ్ ఖాన్ కి సైతం తెలంగాణ సెగ

    By Srikanya
    |

    ఇన్నాళ్లూ తెలుగు హీరోలు మాత్రమే తెలంగాణా సెగకు ఇబ్బందులు పడ్డారు.అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ సైతం తెలంగాణా సెగ తగిలి ఇక్కడి టూర్ ని కాన్సిల్ చేసుకున్నారు. ఆయన తన తాజా చిత్రం రావన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ ప్లాన్ చేసుకున్నారు.అందులోనూ రావన్ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తూండటంతో ఆయన చాలా ఆసక్తి చూపించారు. కానీ ఇక్కడ తెలంగాణాలో పరిస్ధితులు బాగోలేదని,సెక్యూరిటీ సమస్యలు వస్తే కష్టమని ఆయన ప్రయాణాన్ని ఆపుచేసేసారు. దాంతో బాలీవుడ్ బాధ్షా ఫ్యాన్స్ మొత్తం నీరసపడ్డారు.రావన్ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.అంతేగాక రా వన్ లో రజనీ గెస్ట్ గా రోబో చిట్టి గా కనిపించి అలరించనున్నారు. ఈ విషయాన్ని షారూఖ్ ఖాన్ కన్ఫర్మ్ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ...అవును..రజనీకాంత్ మరోసారి చిట్టి అవతారంలో మా చిత్రంలో కనిపిస్తున్నారు. ఆయన ముంబై వచ్చి షూటింగ్ లో పాల్గొ న్నారు.ఆయనతో పనిచేయటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాలో అదో పన్ని సీన్. కరీనాకపూర్ కొడుకుని జి వన్ గా నేను రక్షించటానికి గూండాలతో ఫైట్ చేస్తూంటే హటాత్తుగా చిట్టి అక్కడ ప్రత్యక్ష్యమవుతాడు.అప్పుడు నేను కరీనాని ఎవరితను అని అడుగుతాను.ఆమె రెస్పాండ్ కాదు. అదో ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ అన్నారు.

    సైన్‌ ఫిక్షన్‌ సూపర్‌ హీరో ఇతివృత్తం ప్రధానాంశంగా షారూఖ్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రామ్‌పాల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న 'రా.వన్‌' చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకుడు. అలాగే 'రా.వన్‌' చిత్రాన్ని స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే నిర్మించినట్టు షారూఖ్‌ చెప్పాడు. ''సినిమాలో మీరు చూసేందంతా కూడా ఇక్కడ నిర్మించిందే... అందుకు మేమెంతో గర్విస్తున్నాం. మా టీమ్‌ గొప్పగా పనిచేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకడుగు ముందుకు తీసుకువెళ్లాం'' అని ఆయన వివరించారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం అన్నట్టుగా 'రా.వన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదిస్తున్నారు.

    ''తెలుగు, తమిళ భాషల్లో చిత్రం అనువాద కార్యక్రమాలు ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాక జర్మనీ, తదితర భాషల్లో కూడా అనువదించే ఆలోచనలో ఉన్నాం'' అని షారూఖ్‌ వెల్లడించాడు.ఇక షారూఖ్ ... తనకు పిల్లల కోసం ఎప్పుటినుంచో ఓ చిత్రం చేయాలని కోరిక ఉందని, అందులో భాగమే ఈ చిత్రం రూపకల్పన అన్నారు.నేను నిజాయితీగా చెప్తున్నాను..ఎక్స్ మెన్ సిరీస్ నుంచే ప్రేరణ పొందాను అన్నారు.ఇక తాను డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రం చేస్తానని అయితే ఆ చిత్రం తన కెరీర్ అతి గొప్ప చిత్రం కావాలని,అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.షూటింగ్ అనంతరం కూడా చిత్రాన్ని త్రీడి టెక్నాలజీలోకి మార్చడానికి చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కరీనాకపూర్ అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్ని పోషించారు. రా.వన్ అంటే రాండమ్ యాక్సెస్ వెర్షన్ అని అర్ధమని షారుఖ్ తెలిపారు.

    English summary
    "Every film has its own space. I am happy that in the recent past there are three or four films which have done great business. When it comes to box office, I hope even my film is good enough. We hope we will be able to touch the success of those films," Shahrukh told reporters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X