»   » వేలం వేయనున్న స్టార్ హీరో, హాట్ హీరోయిన్ బట్టలు

వేలం వేయనున్న స్టార్ హీరో, హాట్ హీరోయిన్ బట్టలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపిక పదుకొనె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా ప్రచారం కోసం సరికొత్త కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ చిత్రంలో షారుక్, దీపిక పడుకొనె ధరించిన దుస్తులను వేలం వేయబోతున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారట.

ఇలా దుస్తులు వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించడం సంతోషంగా ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు. అదే సమయంలో సినిమాకు మంచి ప్రమోషన్స్ కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారు. వేలం ఎప్పుడనేది త్వరలో నిర్ణయించనున్నారు.

షారుక్ ఖాన్‌, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'. ఆగస్టు 9న విడుదలకు సిద్ధమౌతోంది. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

ఈచిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఇటీవల ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లు షారుక్ ఖాన్, దీపిక పడుకొనె, దర్శకుడు రోహిత్ శెట్టితో పాటు....ఈ సినిమాలో ఐటం సాంగులో నర్తించిన దక్షిణాది హీరోయిన్ ప్రియమణి కూడా హాజరై సందడి చేసింది. ఆడియో విడుదల కార్యక్రమంలో తారలంతా ఎంతో సందడిగా ఉత్సాహంగా పాల్గొన్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ ఈచిత్రాన్ని నిర్మించారు.

English summary
Shahrukh Khan and Deepika Padukone are all set to rock the nation with their upcoming film Chennai Express. According to recent reports, Chennai Express team is planning to auction Shahrukh and Deepika's clothes from the movie. The money collected from the auction will go to the charity.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu