»   » షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ రియల్ లవ్ స్టోరీ...(ప్రత్యేకం)

షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ రియల్ లవ్ స్టోరీ...(ప్రత్యేకం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ ఆదర్శ దంపతుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు షారుక్ ఖాన్-గౌరీ. గౌరిని ప్రేమ వివాహం చేసుకున్న షారుక్....ఆమెతో సంసార జీవిత ప్రయాణం మొదలు పెట్టి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ రోజు వారి పెళ్లి రోజు. అక్టోబర్ 25, 1991న ఢిల్లీలో వీరి వివాహం జరిగింది.

షారుక్ 19 ఏళ్ల వయసులోనే గౌరీని తొలి సారి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. మొత్తానికి ఆమెను ఇంప్రెస్ చేసి ప్రేమించేట్లు చేసుకున్నాడు. ఐదేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ మాత్రం తమ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి దైర్యం చేయలేదు.

దీంతో గౌరీ తండ్రిని మెప్పించడానికి రంగంలోకి దిగిన షారుక్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట. తర్వాత వీరి మధ్య చిన్నచిన్న గొడవలు కూడా వచ్చాయి. ఓ సారి గౌరీ అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్స్‌తో ముంబై వెళ్లి పోయింది. ఈ విషయం తెలిసిన షారుక్...తన తల్లికి ప్రేమ గురించి వివరించి ఆమె వద్ద డబ్బు తీసుకుని ముంబై వెళ్లి అన్ని బీచ్‌లూ వెతికాడట. చివరకు అక్షా బీచ్‌లో గౌరీని కలిసాడు. ఆ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషన్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో షారుక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో గౌరీ అర్థం చేసుకుంది. వారి ప్రేమ మరింత బలపడింది. చివరి వరకు కలిసి జీవించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ జంట.

షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్‌ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు. గౌరీ విషయానికొస్తే... ఆమె కేవలం షారుక్ ఖాన్ భార్యగానే కాకుండా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో గౌరీ, షారుక్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో పాటు, రెడ్ చిల్లీస్ ఎంటర్‍‌టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నెలకొల్పారు.

2010లో హృతిక్ భార్య సుసానె రోషన్ భాగస్వామ్యంతో సొంతంగా ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ మాట్లాడుతూ...'నేను చేసే ప్రతి పనికి ప్రేరణ షారుక్. నేను ఇంటీరియల్ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు షారుక్ ఎంతో హాపీగా ఫీలవడంతో పాటు నన్ను ప్రోత్సహించారు' అని చెప్పుకొచ్చారు. ఇలా ఎంతో అన్యోన్యంగా, ప్రేమ పూరితంగా, రొమాంటిక్‌గా, ఒకరి అభిరుచులకు, అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఆదర్శవంతమైన దాంపత్య జీవితం గడుపుతున్నారు షారుక్-గౌరీ. ఈ ఇద్దరికీ సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి.

ఎలా కలిసారు?

ఎలా కలిసారు?


1984లో స్కూల్ స్టూడెంట్స్‌గా ఉన్నపుడు షారుక్-గౌరీ కలిసారు. అదే సమయంలో స్కూల్‌లో జరిగిన ఒక పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు డాన్స్ చేసారు.

షారుక్‌కు నో చెప్పిన గౌరీ

షారుక్‌కు నో చెప్పిన గౌరీ


గౌరీ వేరే అబ్బాయితో డాన్స్ చేస్తుండగా ఆమెను తొలి సారి చూసి, ఆమెపై మనసు పారేసుకున్నాడు షారుక్. తనతో డాన్స్ చేయాలని కోరుతూ తన ఫ్రెండుతో రాయబారం పంపాడట. అపుడు గౌరీ షారుక్‌తో డాన్స్ చేయడానికి నో చెప్పిందట.

షారుక్‌తో అబద్దం చెప్పిన గౌరీ

షారుక్‌తో అబద్దం చెప్పిన గౌరీ


షారుక్‌ తరచూ తన వెంట పడుతుండటంతో అతన్ని ఏడిపించడానికి....ఓసారి బాయ్ ఫ్రెండు కోసం ఎదురు చూస్తున్నట్లు అబద్దం చెప్పిందట. కానీ అతను గౌరీ బ్రదర్ అని తెలియడంతో షారుక్ రియలైజ్ అయ్యాడట.

గౌరీని ఇంప్రెస్ చేసిన షారుక్

గౌరీని ఇంప్రెస్ చేసిన షారుక్


మొత్తానికి తన మాటలు, చేష్టలతో గౌరీని ఇంప్రెస్ చేసి ఆమెను కూడా ప్రేమలోకి దించాడు షారుక్.

ఐదేళ్లు రహస్యంగా...

ఐదేళ్లు రహస్యంగా...


స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన షారుక్-గౌరీ ఐదేళ్ల పాటు ఈ విషయాన్ని ఇంట్లో తెలియకుండా సీక్రెట్‌గా ఉంచారు.

షారుక్‌తో పెళ్లికి నిరాకరించిన గౌరీ తల్లిదండ్రులు

షారుక్‌తో పెళ్లికి నిరాకరించిన గౌరీ తల్లిదండ్రులు


షారుక్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో...ఈ పెళ్లికి గౌరీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

చివరకు అంగీకరించారు

చివరకు అంగీకరించారు


షారుక్-గౌరీ మధ్య ఉన్న ప్రేమ విషయం అర్థం చేసుకున్న గౌరీ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు.

గౌరీ గురించి షారుక్

గౌరీ గురించి షారుక్


గౌరీ ఎంతో నిజాయితీగా ఉంటుంది. ఆమె వల్లనే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఆమె కృషి ఎంతో ఉందని షారుక్ వెల్లడించారు.

ఆమెనే తన బలం

ఆమెనే తన బలం


షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్‌ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు.

English summary
Shahrukh Khan and Gauri Khan, the undisputed king and queen of bollywood, celebrate their 22nd wedding anniversary today. The couple got married in a traditional Hindu wedding ceremony in Delhi on the 25th October, 1991. Their love story is one of the most dramatic one and seems too perfect to be true.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu