»   » 'ఫేస్‌బుక్‌ మెన్షన్‌' తొలి సెలబ్రిటీ ఈ స్టార్ హీరోనే

'ఫేస్‌బుక్‌ మెన్షన్‌' తొలి సెలబ్రిటీ ఈ స్టార్ హీరోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉవ్వెత్తిన ఎగిసి,దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌ ఓ కొత్త యాప్‌ని ప్రవేశ పెట్టింది. అయితే కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఈ యాప్‌ని వినియోగించుకునే వీలుంటుంది. దాని ద్వారా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు లైవ్‌ వీడియో ద్వారా తామేం చేస్తున్నదీ అభిమానులతో పంచుకోవచ్చు. ఈ కొత్త అప్లికేషన్‌ పేరు 'ఫేస్‌బుక్‌ మెన్షన్స్‌'.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీన్ని భారత్‌లో పరీక్షించడంలో భాగంగా ఫేస్‌బుక్‌ సంస్థ షారుఖ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఈ యాప్‌ని భారత్‌లో వినియోగిస్తున్న మొదటి సెలబ్రిటీగా ఆయన రికార్డులకెక్కారు. ఇకపై ఈ యాప్‌ ద్వారా ఆయన తన అభిమానులకు లైవ్‌ వీడియోలతో టచ్‌లో ఉండనున్నారు.

Shahrukh Khan Becomes First Bollywood Star To Use Facebook Mentions Live Broadcast

అలాంటి వీడియోనే ఒకటి ఇక్కడ చూడండి..

Just another day at work.

Posted by Shah Rukh Khan on 6 August 2015

తొలివిడతగా 15 వీడియోలు పోస్ట్‌ చేశారు. అందులో షారుఖ్‌ అభిమానులకు తన తదుపరి చిత్రం 'ఫ్యాన్‌' సెట్స్‌ని, చిత్ర యూనిట్ పరిచయం చేశారు. తనని ఫ్యాన్‌గా చూపిస్తున్న ఆస్కార్‌ విజేత అయిన మేకప్‌ మ్యాన్‌ గ్రెగ్‌క్యానమ్‌ని కూడా ఆయన పరిచయం చేశారు.

English summary
Shahrukh Khan has once again demonstrated why he is called the King Khan of Bollywood.The day Facebook launched their new feature: Live broadcast for their Mentions app, he became the first Indian celebrity to use it. The video shot via Facebook Mentions has already crossed 1.2 million views at the time of writing.
Please Wait while comments are loading...