»   » తన సరోగేట్ బేబీ పేరు ప్రకటించిన షారుక్ ఖాన్

తన సరోగేట్ బేబీ పేరు ప్రకటించిన షారుక్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సర్రోట్ పద్దతిలో మూడో సంతానాన్ని తండ్రైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు షారుక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమ ఇంట మగ బిడ్డ పుట్టాడని, 'అబ్‌రామ్' అని నామకరణం చేస్తున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించారు. 'అబ్‌రామ్' అనే పేరు హిందూ-ముస్లిం పేర్ల కలయికతో ఉండటం గమనార్హం.

అయితే ఈ బిడ్డ విషయంలో లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించినట్లు వచ్చిన వార్తలను షారుక్ ఖండించారు.

షారుక్ దంపతులు సర్రోగేట్(అద్దెగర్భం) పద్దతిలో మగబిడ్డను కాన్నారని గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చట్ట విరుద్ధంగా తన బిడ్డ పుట్టకముందే బిడ్డ సెక్స్(ఆడా? మగా?) ఏమిటనే విషయాన్ని తెలుసుకున్నారనే వివాదం కూడా చెలరేగింది.

ఇన్ని రోజులు ఈ వార్తలపై, వివాదాలపై మౌనంగా ఉన్న షారుక్ ఎట్టకేలకు నోరు విప్పారు. బిడ్డ నెలలు నిండక ముందే జన్మించాడని, బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన కారణంగానే ఇంత కాలం తనేమీ మాట్లాడలేకపోయానని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. బిడ్డ పుట్టక ముందు తాము ఎలాంటి సెక్స్ డిటర్మేషన్(లింగ నిర్ధారణ) టెస్టులు నిర్వహించలేదని స్పష్టం చేసారు. కొంత మంది కావాలని ఈ విషయమై రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.


భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానాలతో కలిసి షారుక్


షారుక్ ఖాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు ఆర్యన్, కూతురు పేరు సుహానా

షారుక్ ఖాన్ తన ఇద్దరు పిల్లతో ఎంతో సన్నిహితంగా ఉంటారు. తండ్రిలా కాకుండా వారితో స్నేహితుడిలా వ్యవహరిస్తూ ఉంటాడు.


షారుక్ తనయుడు ఆర్యన్ ప్రస్తుతం లండన్లో చదువుకుంటున్నాడు. ఆర్యన్ ను తన సినీ వారసుడిగా తీర్చి దిద్దుతున్నాడు షారుక్


తండ్రి షారుక్ తో కలిసి సైకిల్ తొక్కుతూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుహానా

షారుక్ తనకు సర్రోగేట్ పద్దతిలో మగ బిడ్డ పుట్టాడనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి విహార యాత్రలో షారుక్


సర్రోగేట్ పద్దతిలో బిడ్డను కనాలని షారుక్-గౌరీ కలిసి తీసుకున్న నిర్ణయమే. షారుక్ వీర్యకణాలు, గౌరీ ఖాన్ అండం సేకరించి వాటి ద్వారా వేరొక మహిళ గర్భంలో వీరి బిడ్డ జన్మించడాన్ని సరోగేట్ పద్దతి అంటారు.


షారుక్-గౌరీలది ప్రేమ వివాహం. వీరి పెళ్లి తర్వాత షారుక్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.


షారుక్-గౌరీ అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది యువ జంటలకు వీరు ఆదర్శంగా నిలిచారు.

English summary
Mumbai: Superstar Shahrukh Khan, who made bold headlines due to his surrogate baby, has finally confirmed the birth of a baby boy at his home. The actor also told the media that he has named his son Abram. However, SRK denied that he took any sex determination test.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu