రిలీజైన 18 ఏళ్లకు పెరూ ప్రేక్షకుల కోసం మన చిత్రం

By Srikanya

ముంబై: 'దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే'(డీడీఎల్‌జే) ఈ చిత్రం పేరు వినని సినీ ప్రేమికులు అరుదుగానే ఉంటారు. ఎందుకంటే ఈ చిత్రం సాధించిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రద్దలు కొట్టే చిత్రమేదీ ఇప్పటికి రాలేదు. అలాగే ఈ చిత్రం నుంచి ప్రేరణ పొందిన చిత్రాలు ఇప్పటికి దాదాపు ప్రతీ భాషలోనూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం పెరూ లోనూ విడుదల అవుతోంది. ఈ సినిమా రూపుదిద్దుకొని 18 సంవత్సరాల గడిచిన తర్వాత పెరూ ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

Shahrukh Khan 'Dilwale Dulhania Le Jayenge' to release in Peru

భాష ఏదైనప్పటికీ ఈ రోజుల్లో ఓ చలన చిత్రం నెల రోజుల పాటు ఆడితే అదే గొప్ప. కానీ ఒక సినిమా గత 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రదర్శించబడటం మాత్రం చెప్పుకోగ్గ విషయమే. ఈ ఘనతను సొంతం చేసుకున్న చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే'(డీడీఎల్‌జే). షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు ఆ తర్వాత రూపుదిద్దుకున్న పలు చిత్రాల్లోనూ చోటు చేసుకున్నాయి.

అంతటి పేరును సంపాదించుకున్న ఈ చిత్రాన్ని త్వరలో పెరూ దేశంలోనూ ప్రదర్శించనున్నారు. 18 సంవత్సరాల క్రితం(1995) విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు ఆదిత్య చోప్రా. దీనికి నిర్మాత ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు యశ్‌ చోప్రా. తన మొదటి ప్రయత్నంతోనే ఆదిత్య చోప్రా ప్రేక్షకుల మనసులను ఉర్రూతలూగించారు. ప్రస్తుత ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహర్‌ ఒక చిన్న పాత్రలో ఈ చిత్రంలో తళుక్కుమన్నారు. ముంబయిలోని ఒక సినిమా హాలులో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచీ నేటి వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X