»   » నా పిల్లల్ని నేనే తినేస్తానని భయంగా ఉంది: షారుక్

నా పిల్లల్ని నేనే తినేస్తానని భయంగా ఉంది: షారుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ట్విట్టర్లో విచిత్రమైన కామెంట్ చేసారు. నాలో రహస్యంగా దాగి ఉన్న భయం బయటపెతున్నాను. నాకు రాత్రి పూట నడిచే అలవాటు ఉంది. ఆ సమయంలో నా పిల్లలు ఎదురు పడితే తినేస్తానేమో. ఎందుకంటే వారు కొరుక్కు తినాలనింపించేంత ముద్దుగా ఉంటారు. వాళ్లను తినేస్తానని భయంగా ఉంది అంటూ షారుక్ ట్వీట్ చేసారు.

షారుక్ తాజా సినిమా ‘దిల్ వాలె' సినిమా విషయానికొస్తే...రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజోల్ షారుక్ కు జోడీగా నటిస్తోంది. డిసెంబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను కాజోల్ కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫాంలో ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రా లాంటి వాళ్లకు మాత్రమే ఈ రేంజిలో పారితోషికం ఉంది. అసలు ఫాంలో లేని, వయసు పైబడిన కాజోల్ కు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశం అయింది.

Shahrukh Khan has secret fear

కాజోల్ కు ఉన్న ఇమేజ్, టాలెంట్ తో పోలిస్తే ఇంత మొత్తంలో పారితోషికం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పలువురు అంటున్నారు. మరో వైపు షారుక్-కాజోల్ జోడీ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, సినిమాపై క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే ఆమెకు ఇంత మొత్తంలో పారితోషికం ఆఫర్ చేసారని అంటున్నారు. ఈ చిత్రంలో షారుక్-కాజోల్‌తో పాటు వరుణ్ ధావన్ - కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి-గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రిస్ మస్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని రోహిత్ శెట్టి చెబుతున్నారు.

English summary
"I have this secret fear that one nite while I am sleep walking I will eat up my kids...because I find them sooo edible. Slurp slurp" Shah Rukh Khan tweeted.
Please Wait while comments are loading...