»   »  కాజోల్‌ను యాక్సిడెంటల్‌గా కిస్ చేసాడు (వీడియో)

కాజోల్‌ను యాక్సిడెంటల్‌గా కిస్ చేసాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో షారుక్ ఖాన్, కాజోల్ అంటే తిరుగులేని జోడి. అప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. షారుక్, కాజోల్ జోడీ అంటేనే వెండితెరపై మెస్మరైజ్ చేసే జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి ఎలాంటి ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు లేకున్నా..... కేవలం స్క్రీన్ ప్రజెన్స్‌తోనే ఆకట్టుకునే వారు.

చాలా కాలం తర్వాత కాజోల్, షారుక్ కలిసి నటించిన చిత్రం ‘దిల్ వాలె'. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో లేక పోయినా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా రిలీజైన చాలా రోజుల తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ వారు సినిమాలోని ‘తుకుర్ తుకుర్' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.

 Shahrukh Khan And Kajol's Accidental Kiss

సాంగ్ మేకింగ్ ఎంతో ఫన్నీగా సాగింది. ఈ క్రమంలో షారుక్ యాక్సిడెంటల్ గా కాజోల్ ను కిస్ చేసాడు. ఫిబ్రవరి 1న విడుదలైన ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది. పాట చిత్రీకరణ సమయంలో యూనిట్ సభ్యులంతా ఎంత ఎంజాయ్ చేసారో ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై గౌరీఖాన్‌, రోహిత్‌శెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో షారుక్, కాజోల్ తో పాటు యువ జంటగా వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ నటించారు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత షారుఖ్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌ కావడంతో అంచనాలు పెరిగాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

English summary
Kajol and Shahrukh Khan came together for Dilwale, while the movie didn't fare as well as expected it did mint money owing to its overseas collection. Much after the release of the movie, a making video of the song Tukur Tukur has gone viral.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu