twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'హామ్లెట్' ఆధారంగా సూపర్ స్టార్ చిత్రం

    By Srikanya
    |

    షేక్స్ప్‌యర్‌ రాసిన హామ్లెట్ ఆధారంగా త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని విశాల్ భరద్వాజ్ డైరక్ట్ చేయనున్నారు. రావన్ లో సూపర్‌ హీరో పాత్ర పోషించిన షారూఖ్‌ యువరాజుగా కనిపించటానికి ఆసక్తి చూపుతున్నాడు. చేతన్‌ భగత్‌ నవల '2 స్టేట్స్‌' ఆధారంగా రూపొందించే చిత్రం కోసం విశాల్‌ భరద్వాజ్‌, సాజిద్‌ నడియావాలాతో కలిసి షారూఖ్‌ పనిచేయాల్సి ఉంది. కానీ మరో ప్రేమకథా చిత్రంలో నటించటానికి అతడు ముందుకు రావటంలేదు. షేక్స్ప్‌యర్‌ రచనలను తెరకెక్కించటంలో సిద్ధహస్తుడైన విశాల్‌ భరద్వాజ్‌ను 'హామ్లెట్' ను బాలీవుడ్‌కు తీసుకురావాల్సిందిగా షారూఖ్‌ కోరాడు. కత్రినా కైఫ్‌తో కలిసి ఒక ప్రేమకథా చిత్రంలో నటించటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న కింగ్‌ ఖాన్‌.. ప్రయోగాత్మక చిత్రాల రూపకల్పనకు పెద్దపీట విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో నటించటానికి అంగీకరించినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 'హామ్లెట్ ‌' చిత్రం కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న మారుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది.

    షారుఖ్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'రా.వన్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డ్‌ సృష్టించాలని కోరుకుంటున్నాడు. ఈ చిత్రం దీపావళి రోజైన అక్టోబర్‌ 26న విడుదల కానుంది. ఒకప్పటి ప్రత్యర్థి సల్మాన్‌ చిత్రాలు సాధించిన ఘన విజయాల్ని ప్రస్తావించిన షారుఖ్‌, సల్లూభాయ్‌తో తాను పోటీపడటం లేదని పేర్కొంటూనే రా.వన్‌ పాత రికార్డ్‌లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ''ప్రతి సినిమాకూ దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మూడునాలుగు సినిమాలు మంచి బిజినెస్‌ చేశాయి. బాక్సాఫీస్‌ విషయానికొస్తే ఈ నా కొత్త సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆ చిత్రాలు సాధించిన విజయాన్ని మేమూ అందుకోగలమని ఆశాభావంతో ఉన్నాను'' అని మీడియాతో అంటున్నాడు. అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్‌ హీరో చిత్రం 'రా.వన్‌'లో షారుఖ్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల కంటే భారీ వ్యయంతో సిద్ధమవుతున్న రా.వన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3డి ఫార్మాట్‌లో తమిళ్‌, తెలుగు, జర్మన్‌ భాషల్లో డబ్బింగ్‌తో విడుదలవుతుంది. ''నేను భారీ వ్యయంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా వెంట నిలిచిన పార్టనర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళు డబ్బు పెట్టినందుకు కాదు, నా సినిమా మీద నమ్మకముంచినందుకు. ఆ సొమ్ము తిరిగి రావాలంటే గతంలో ఎన్నడూ జరగనంత బిజినెస్‌ జరగాలి'' అని తన కోరిక వెల్లబుచ్చాడు.

    English summary
    Bollywood films director Vishal Bharadwaj is going to make an adaptation of Shakespeare's play 'Hamlet' and none other than Shahrukh Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X