»   » షారుక్ ఖాన్ చిన్న కొడుకు చిపురు పట్టి ఇలా..(ఫోటో)

షారుక్ ఖాన్ చిన్న కొడుకు చిపురు పట్టి ఇలా..(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన చిన్న కొడుకు అబ్‌రామ్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. అబ్‌రామ్ ను గతంలో మీడియాకు వీలైనంత దూరంగా ఉంచిన షారుక్ ఇపుడు మాత్రం అతన్ని ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తున్నాడు.

‘క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాపై నమ్మకం కుదిరిందో లేక చీరుపై కూర్చుని ఆడే ఆట‘క్విడిట్చ్' ఆడాలని అనుకున్నాడో' అని ట్వీట్ చేస్తూ అబ్ రామ్ ఫోటో పోస్టు చేసాడు షారుక్. అబ్ రామ్ చిలిపి చేష్టలు చూసి షారుక్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి మద్దతు పలికిన తొలి కిడ్ అబ్ రామ్ అంటున్నారు అంతా.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సర్రోగసీ పద్దతిలో మూడో సంతానాన్ని పొందిన సంగతి తెలిసిందే. మే 27, 2013లో 13న జన్మించిన ఈ బిడ్డకు అబ్ రామ్ అనే పేరు పెట్టారు. ఈ బిడ్డ విషయంలో అప్పట్లో వివాదం చెలరేగింది. లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించినట్లు వచ్చిన వార్తలను షారుక్ ఖండించారు. షారుక్ దంపతులు సర్రోగేట్(అద్దెగర్భం) పద్దతిలో ఈ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

బిడ్డ నెలలు నిండక ముందే జన్మించాడని, బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన కారణంగానే తొలుత తానేమీ మాట్లాడలేకపోయానని షారుక్ ఖాన్ స్పష్టం చేసారు. బిడ్డ పుట్టక ముందు తాము ఎలాంటి సెక్స్ డిటర్మేషన్(లింగ నిర్ధారణ) టెస్టులు చేయించలేదని స్పష్టం చేసారు. షారుక్ ఖాన్ కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు ఆర్యన్, కూతురు పేరు సుహానా.

English summary
Bollywood badshah Shahrukh Khan is very particular about sharing any details of his li'l son AbRam. The actor who kept his son away from media glare for a very long time, now keeps posting AbRam's pics and updates his fans.
Please Wait while comments are loading...