twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మత అసహనం వివాదం: స్టార్ హీరో ఇంటికి పోలీసు బందోబస్తు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ కొందరు రచయితలు, సినీ ప్రముఖులు తమ అవార్డులు వెనక్కి ఇవ్వడం, మరికొందరు ఈ పరిణామాలను వ్యతిరేకిస్తుండటం..... దేశంలో ఇపుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై షారుక్ ఖాన్ స్పందించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసింది. కొందరు బీజేపీ నేతలు ఆయన్ను పాకిస్థాన్ ఏజెంటుగా అభివర్ణించారు. ఈ వివాదం ఎక్కువ కావడంతో ఆయన నివాసం మన్నత్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.

    షారుక్ అసలు ఏమన్నారు?
    దేశంలో పెరిగిపోతున్న మత అసహనం మనల్ని చీకటి యుగానికి తీసుకెళుతుందని బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఎన్‌డీటీవీ, ఇండియా టుడే చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసహన వాతావరణానికి నిరసనగా రచయితలు, శాస్త్రవేత్తలు అవార్డులు వెనక్కి ఇస్తుండటంపై స్పందిస్తూ.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేందుకు వెనకాడనని, అయితే, అలా చేయాల్సిన అవసరం లేదన్నారు.

    Shahrukh Khan's Mannat Under Tight Security, Owing To Intolerance Remarks

    దేశంలో తీవ్ర అసహనం ఉంది. ఇలా అసహనం ప్రదర్శించడం మూర్ఖత్వం. ఇది చాలా పెద్ద సమస్య. దేశభక్తి పేరుతో మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేది నీచమైన నేరం. అసహనం ఏ రూపంలో ఉన్నా అది చెడ్డది. అది మనల్ని చీకటి యుగాలకు తీసుకెళుతుంది. మీరు ఒకవేళ దేశభక్తులైతే.. కొన్ని ప్రాంతాలు, మతాలను మాత్రమే కాదు.. దేశం మొత్తాన్నీ ప్రేమించాలి. అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు వెనక్కి ఇచ్చేవారిని గౌరవిస్తున్నాను. కానీ నేను అలా చేయాల్సిన అవసరం లేదు. మాంసం తినే అలవాట్లను బట్టి మతాన్ని నిర్వచించరాదు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేనూ మాట్లాడొచ్చు. కానీ జనం నా ఇంటి ముందుకు వచ్చి రాళ్లేస్తారు'' అని షారుక్‌ తన జన్మదిన సందేశంలో చెప్పారు.

    English summary
    Shahrukh Khan's intolerance controversy continues! The actor who addressed the issue of Shiv Sena calling for a ban on Pakistani actors, cricketers and musicians in Maharashtra has become a topic of national discussion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X