For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మీడియాను క్షమించమన్న సూపర్ స్టార్

  By Srikanya
  |

  లేట్‌గా రావాలని నేనూ అనుకోను. కానీ ఈ మధ్య నాకు వర్క్ ఎక్కువైంది. రాత్రి బాగా ఆలస్యంగా నిద్రపోతున్నాను. అందుకే ఉదయం త్వరగా లేవలేకపోతున్నాను. అందుకని దయచేసి నన్ను క్షమించండి అన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్. షారుక్ నటించి, నిర్మించిన రా.ఒన్ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో షారుక్ జోరుగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. కేవలం ముంబయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పబ్లిసిటీ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల న్యూఢిల్లీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియావారిని పిలిచారట. అయితే ప్రెస్‌మీట్‌కి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చి మీడియావారికి కోపం తెప్పించారు షారుక్. ఆ తర్వాత ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా ఇదే తంతు. మూడు గంటలు లేట్‌గా వచ్చారు. ఇంకో కార్యక్రమానికి రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చి మీడియావారు పడిగాపులు కాచేలా చేశారు. ఈ బాద్‌షా వ్యవహారం టూమచ్‌గా ఉందని భావించిన మీడియా వారు మీరు చెప్పిన సమయానికి ఎప్పుడు వస్తారు? అని ప్రశ్నించినప్పుడు ఆయన ఇలా స్పందించారు. దాంతో మీడియావారు ఆ సమాధానంతో సంతృప్తి చెందక... పోనీ మీరు లేట్‌గా వచ్చినప్పుడు.. ఆ విషయాన్ని ముందుగా మీ మేనేజర్ ద్వారా మాకు చెబితే, మాకు ఈ పడిగాపులు తప్పుతాయి కదా? అన్నారు. ఇకనుంచి తప్పకుండా అలానే చేస్తానని మీడియావారికి మాటిచ్చారు.

  సైన్‌ ఫిక్షన్‌ సూపర్‌ హీరో ఇతివృత్తం ప్రధానాంశంగా షారూఖ్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రామ్‌పాల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న 'రా.వన్‌' చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకుడు. అలాగే 'రా.వన్‌' చిత్రాన్ని స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే నిర్మించినట్టు షారూఖ్‌ చెప్పాడు. ''సినిమాలో మీరు చూసేందంతా కూడా ఇక్కడ నిర్మించిందే... అందుకు మేమెంతో గర్విస్తున్నాం. మా టీమ్‌ గొప్పగా పనిచేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకడుగు ముందుకు తీసుకువెళ్లాం'' అని ఆయన వివరించారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం అన్నట్టుగా 'రా.వన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదిస్తున్నారు. ''తెలుగు, తమిళ భాషల్లో చిత్రం అనువాద కార్యక్రమాలు ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాక జర్మనీ, తదితర భాషల్లో కూడా అనువదించే ఆలోచనలో ఉన్నాం'' అని షారూఖ్‌ వెల్లడించాడు.ఇక షారూఖ్ ... తనకు పిల్లల కోసం ఎప్పుటినుంచో ఓ చిత్రం చేయాలని కోరిక ఉందని, అందులో భాగమే ఈ చిత్రం రూపకల్పన అన్నారు.నేను నిజాయితీగా చెప్తున్నాను..ఎక్స్ మెన్ సిరీస్ నుంచే ప్రేరణ పొందాను అన్నారు.ఇక తాను డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రం చేస్తానని అయితే ఆ చిత్రం తన కెరీర్ అతి గొప్ప చిత్రం కావాలని,అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.షూటింగ్ అనంతరం కూడా చిత్రాన్ని త్రీడి టెక్నాలజీలోకి మార్చడానికి చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కరీనాకపూర్ అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్ని పోషించారు. రా.వన్ అంటే రాండమ్ యాక్సెస్ వెర్షన్ అని అర్ధమని షారుఖ్ తెలిపారు.

  English summary
  Shahrukh Khan has apologized and promised henceforth to per-inform organizers as well as the media about his delays.In the past, Shahrukh has been late for several events and at an event in New Delhi, he came four hours late.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X