»   » వాడి పెదాలు కోస్తా : బాలీవుడ్ స్టార్ షారుక్ సంచలన వ్యాఖ్యలు!

వాడి పెదాలు కోస్తా : బాలీవుడ్ స్టార్ షారుక్ సంచలన వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ స్టార్ షారుక్ ఖాన్ ఇటీవల డిఎన్ఏ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎవరైనా అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే వాడి పెదాలను కొస్తానని హెచ్చరించాడు.

ఆర్యన్ ఖాన్ ఎవరైనా అమ్మాయి పెద్దాలను ముద్దాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ప్రశ్నకు స్పందిస్తూ షారుక్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయికి తండ్రిగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అమ్మాయి పెదాలను కోయను

అమ్మాయి పెదాలను కోయను

ఒక వేళ ఎవరైనా అమ్మాయే మీ అబ్బాయిని ముద్దాడితే? ఏం చేస్తారు అంటే, ‘అలా అయినా సరే ఆర్యన్ కే శిక్ష..... ఆ అమ్మాయి పెద్దాలను మాత్రం కోయను. అలా చేసే అమ్మాయిలు చూడటానికి బావుండరు' అంటూ షారుక్ చమత్కరించారు.

క్రమశిక్షణ విషయంలో కఠినం

క్రమశిక్షణ విషయంలో కఠినం

తన కుమార్తె సుహానా, కుమారుడు ఆర్యన్‌ క్రమశిక్షణ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని షారుక్‌ తెలిపారు. ఈ విషయంలో తాను రాజీ పడనని, ఈ విషయం తన ఇద్దరు పిల్లలకు కూడా తెలుసని షారుక్ తెలిపారు.

నా కూతురు జోలికి వస్తే ఊరుకోను

నా కూతురు జోలికి వస్తే ఊరుకోను

ఒక తండ్రిగా నా కూతురుకు నేను రక్షణగా ఉంటాను. ఎవరైనా ఆమె జోలికి వస్తే అస్సలు ఊరుకోను. ఎవరైనా అబ్బాయి తన కూతురు పెదాలను ముద్దాడితే వాడి పెదాలను కోస్తాను అంటూ... గతంలో షారుక్ ‘కాఫీ విత్ కరణ్' అనే కార్యక్రమంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

జీవితం గురించి చక్కగా..

జీవితం గురించి చక్కగా..

ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం చెప్పిన షారుక్ ఖాన్.... ఫిలాసపీ గురించి, జీవితం గురించి ఎంతో చక్కగా వివరించారు.

షారుక్ మూవీస్

షారుక్ మూవీస్

షారుక్ ఖాన్ ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో షారుక్‌కు జోడీగా అనుష్క శర్మ నటిస్తోంది.

English summary
Shahrukh Khan in a candid interview with DNA said that he'd rip off Aryan Khan's lips if he ever kisses a girl and will do a big favour to the girl's father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu