twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్-షకలక శంకర్ ఇష్యూ... డబ్బు వేస్ట్ చేయడం వల్లే, ఆలీ సాక్షిగా ఇదే నిజం...

    By Bojja Kumar
    |

    Recommended Video

    Shakalaka Shankar Talks About Pawan Kalyan

    'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ సమయంలో కమెడియన్ షకలక శంకర్ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అపుడు ఏం జరిగింది? ఆయన ఎందుకు తిట్టారు? దీనిక వెనక జరిగిన అసలు సంఘటన ఏమిటి? అనే విషయాలను అలీతో సరదాగా కార్యక్రమంలో శంకర్ బయట పెట్టారు. 'శంభో శంకర' సినిమాతో హీరోగా మారిన ఈ కమెడియన్ దీంతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

     నేను హీరోను కాదు, పనోడిని...

    నేను హీరోను కాదు, పనోడిని...

    నాకు హీరో అని పిలిపించుకోవడం ఇష్టం లేదు, పనోడిని అనిపించుకోవడం ఇష్టం. రెండు సంవత్సరాలుగా నాకు పని లేదు. ఆ పని లేకనే ఈ పని (హీరో) క్రియేట్ చేసుకున్నాను.

    నాకు కెమెరా ముందు యాక్ట్ చేయడమే ముఖ్యం. అది కమెడియన్ అయినా, హీరో అయినా, విలన్ అయినా ఏదైనా ఓకే. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన పని(పాత్రలు) దొరకనందు వల్లనే ఈ పని క్రియేట్ చేసుకున్నాను అని శంకర్ తెలిపారు.

    ఆ హీరోల వల్లే నా చదువు ఆగింది

    ఆ హీరోల వల్లే నా చదువు ఆగింది

    చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటం వల్లనే నాకు చదువు మీద ఆసక్తి పోయి సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను ఆర్ట్ వేస్తుంటాను. ఆరో తరగతిలో ఎగ్జామ్ హాల్లో హిట్లర్ సినిమాలో చిరంజీవి బైక్ మీద కూర్చున్న బొమ్మ వేశాను. మాస్టర్ సినిమా విడుదలైన తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.... అని శంకర్ తెలిపారు.

    మంజునాథ సినిమా సమయంలో ఎంట్రీ

    మంజునాథ సినిమా సమయంలో ఎంట్రీ

    పదో తరగతి తెలుగు మాత్రమే పాసయ్యాను. తర్వాత మంజునాథ షూటింగ్ సమయంలో ఇండస్ట్రీలో పేయింటర్‌గా కెరీర్ మొదలు పెట్టాను. అలా వచ్చిన నేను 8 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్లలేదు.... అని శంకర్ గుర్తు చేసుకున్నారు.

    ఇంట్లో నేను చచ్చిపోయాను అనుకుని ఫోటో పెట్టేశారు.

    ఇంట్లో నేను చచ్చిపోయాను అనుకుని ఫోటో పెట్టేశారు.

    నేను చాలా రోజులు ఇంటికి రాక పోవడంతో నేను చచ్చిపోయాను అనుకుని మా ఇంట్లో ఫోటో కూడా పెట్టేశారు. నేను వెళ్లిన తర్వాత బ్రతికి ఉన్నానని చాలా సంతోష పడ్డారు. సినిమా యాక్టర్ అయ్యానని చెప్పడంతో గర్వంగా ఫీలయ్యారు... అని శంకర్ తెలిపారు.

    నా దగ్గర మ్యాటర్ అయిపోవడం వల్లనే జబర్దస్త్ మానేశా

    నా దగ్గర మ్యాటర్ అయిపోవడం వల్లనే జబర్దస్త్ మానేశా

    జబర్దస్త్ వల్లనే నాకు గుర్తింపు వచ్చింది. అయితే దాన్ని మానేయడానికి కారణం నా దగ్గర మ్యాటర్ అయిపోవడమే. చిన్న షోలలో చేస్తే మనకు గుర్తింపు రాదు, సినిమాల్లో చేస్తే వస్తుంది అని మాత్రం కాదు. నేను ఏదైతే ఫీలై వచ్చానో? ఏదైతే చేద్దామనుకున్నానో అన్నీ చేశాను. ఏమీ దొరక్క మళ్లీ రిపీట్ చేశాను. దీంతో ఏంటి ఇలా రిపీట్ చేస్తున్నావని ఆడియన్స్ అన్నారు. నా దగ్గర మ్యాటర్ అయిపోయింది. మళ్లీ రిపీట్ చేసి వారికి బోర్ కొట్టించడం ఇష్టం లేకనే సినిమాల్లోకి వచ్చాను.... అని శంకర్ తెలిపారు.

    పొరపాటు మాట అనడం వల్లనే పవన్ కళ్యాణ తిట్టారు

    పొరపాటు మాట అనడం వల్లనే పవన్ కళ్యాణ తిట్టారు

    ‘సర్దార్ గబ్బర్ సింగ్' సమయంలో నేను తప్పుగా ప్రవర్తించడం వల్లనే పవన్ కళ్యాణ్ నన్ను తిట్టారు, మరోసారి అలా ప్రవర్తించకు అని మందలించి పంపారు అని శంకర్ వెల్లడించారు.

    నా దేవుడు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకే వెళ్లాను

    నా దేవుడు పవన్ కళ్యాణ్‌ను చూసేందుకే వెళ్లాను

    నేను నమ్ముకున్న ఎర్ర టవల్ మీద ఒట్టేసి చెబుతున్నాను. నేను ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో జాయిన్ కావడానికి ప్రధాన కారణం నా దేవుడిని చూడొచ్చనే. 75 రోజులు షూటింగులో ఆయన్ను ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తూ ఉన్నా తనివి తీరలేదని తెలిపారు.

    ఆయన డబ్బును వేస్ట్ చేస్తుంటే మండింది

    ఆయన డబ్బును వేస్ట్ చేస్తుంటే మండింది

    కళ్యాణ్ బాబు దగ్గర డబ్బులు లేవు. అందరిలా డబ్బున్న హీరో కాదు. పవర్, పేరు ఉన్న పేద హీరో ఆయన. ఆయన వెనక తాతలు, తండ్రలు సంపాదించిన డబ్బులు లేదు, స్టూడియోలు లేవు. ఎంత డబ్బు పోసినా వెలకట్టలేని రేంజి, పవర్ ఆయనది. నేను ఆయన భక్తుడిని. ఆయన సొంత డబ్బుతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. షూటింగులో చాలా రోజులుగా నేను ఓ విషయం గమనిస్తున్నారు. డైరెక్టర్ తీసిన షాట్లే మళ్లీ మళ్లీ తీస్తూ నా దేవుడి డబ్బు వేస్ట్ చేస్తుండటంతో కోపం వచ్చింది... అని శంకర్ తెలిపారు.

    ఆ కోపంతోనే అతడి మీద అరిచాను

    ఆ కోపంతోనే అతడి మీద అరిచాను

    ప్రతి రోజూ 500 నుండి 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 75 రోజుల షూటింగ్. అదేమైనా పెళ్లా? ఎంత మందికి భోజనాలు పెట్టాలి? ఎన్ని సార్లు నువ్వు వచ్చి వన్ మోర్ చెబుతావు? డబ్బు ఎవరిది? నువ్వేమో వన్ మోర్ అంటూ పెట్టెలకు పెట్టెలు డబ్బులు తగలేస్తున్నావు. అర్థం పర్ధం లేకుండా ఒక షాట్ పది సార్లు తీస్తున్నావు. అందుకే నాకు కింద నుండి మండింది. ‘ఎన్నిసార్లు తీసిన షాటే తీస్తావు, క్లియర్‌గా చెప్పు ఒకసారి' అని కో డైరెక్టర్ మీద అరిచాను. డైరెక్టర్‌ను ఏమీ అనలేదు... అని శంకర్ వెల్లడించారు.

    నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని తిట్టారు

    నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని తిట్టారు

    నేను ఇలా అన్న విషయం ఆయనకు(పవన్ కళ్యాణ్) తెలిసింది. పిలిచాడు. అప్పుడే డైరెక్టర్లను, కో డైరెక్టర్లను అనే రేంజికి వచ్చావా? వాళ్లు ఎన్ని సార్లు తీస్తే నీకెందుకు? ఎంత డబ్బు పెడితే నీకెందుకు? నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, నీ పని నువ్వు చేసి వెళ్లిపో అని మందలించారు. అపుడు మీరు(అలీ) కూడా అక్కడే ఉన్నారు. ఇదే జరిగింది. నేను నమ్ముకున్న నా కలామతల్లి మీద ఒట్టు.... అని శంకర్ స్పష్టం చేశారు.

    English summary
    After Shambho Shankara movie release, Shakalaka Shankar Participated Alitho Saradaga show. Shambho Shankara is an Telugu movie starring Shakalaka Shankar and Karunya Chowdary in a prominent roles. It is a drama directed by N. Sreedhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X