»   » మా పెళ్లాలు తరిమేశారు, నా డబ్బంతా అటే, ఇల్లు కూడా లేదు: షకలక శంకర్

మా పెళ్లాలు తరిమేశారు, నా డబ్బంతా అటే, ఇల్లు కూడా లేదు: షకలక శంకర్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Shakalaka Shankar Shocking Comments On Trivikram Srinivas, Dil Raju

  క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం శంభో శంక‌ర‌. శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో శంకర్ ఆసక్తికరంగా ప్రసంగించారు.

  డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్‌, నాకు మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. మాకు సినిమాలంటే ఆస‌క్తిని క‌లిగేలా చేసింది నిర్మ‌ల‌మ్మ‌. ఆవిడ వ‌ల్ల‌నే సినిమా జీవితం గురించి మేం తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్ప‌టికీ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

  కథ పట్టుకుని అందరినీ కలిశాను

  కథ పట్టుకుని అందరినీ కలిశాను

  ఈ సినిమా కథను మొదట త్రివిక్రమ్ దగ్గరికి తీసుకెళ్లి రూ. 2 కోట్లతో చేయమని అడిగాను, తప్పకుండా 8 కోట్లు వస్తాయని చెప్పాను. ఆయన నా దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీగా ఉండటంతో తర్వాత చేస్తామన్నారు. తర్వాత దిల్‌రాజు వద్దకు, హీరో శిరీష్ వద్దకు తీసుకెళ్లాను. వారు చేస్తామ‌న్నారు కానీ.. రెండేళ్ల స‌మ‌యం అడిగారు. ఇలా తిరుగుతండగా మా బాధ‌ను నెల్లూరులోని ర‌మ‌ణారెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయ‌నే ఈ సినిమా నిర్మిస్తున్నారు. అలాంటి నిర్మాత‌లుంటే నాలాంటి వారెంద‌రో హీరోలుగా, శ్రీధ‌ర్‌లాంటివాళ్లు ద‌ర్శ‌కులుగా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు.... అని శంకర్ వ్యాఖ్యానించారు.

  రెండేళ్లుగా సినిమాతోనే సంసారం

  రెండేళ్లుగా సినిమాతోనే సంసారం

  ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతున్నాం. ఇంటిని పిల్లలను కూడా సరిగా పట్టించుకోవడం లేదు. మా ఆవిడ, పిల్లలు ఆల్రెడీ శ్రీకాకుళం వెళ్లిపోయారు. డైరెక్టర్ శ్రీధర్ భార్య అర్దరాత్రి ఇంటికెళితే మెడపట్టి బయటకు గెంటేస్తోంది. వెళ్లి శంకర్ తోనే సంసారంచేయి, అతడినే పెళ్లి చేసుకోమని అంటోందట. ఒకటి మాత్రం నిజం.. సినిమావోడు సినిమాతోనే సంసారం చేస్తాడు. అలా చేయకపోతే ఇక్కడ కష్టం... అని శంకర్ అన్నారు.

  నన్ను కాపాడుతారనే నమ్మకం ఉంది

  నన్ను కాపాడుతారనే నమ్మకం ఉంది

  ఇండస్ట్రీలో ఉన్న అందరూ నాకు స్నేహితులే. నన్ను ఇంతకాలం అవకాశాలు ఇచ్చి కాపాడారు. ఈ సినిమా విషయంలో నన్ను కాపాడుతున్న ఒకే ఒక్కడు.... ప్రేక్షకుడు. వాళ్లు నన్ను కాపాడుతారనే నమ్మకం ఉంది. ఫేస్ బుక్‌లో నన్ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. నా సినిమా వాళ్లు చూసినా నిర్మాతకు డబ్బులు వస్తాయి. మీ అందరికీ నేను, మా డైరెక్టర్ జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ సినిమా ద్వారా మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయబోము. మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరిచే విధంగా సినిమా ఉంటుంది... అని శంకర్ తెలిపారు.

  పవన్ ఫ్యాన్స్ పావలా పర్సంట్ చూసినా 60 కోట్లు

  పవన్ ఫ్యాన్స్ పావలా పర్సంట్ చూసినా 60 కోట్లు

  ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా దేవుడు పవన్ కళ్యాణ్ గురించి. ఆయన ఫ్యాన్స్ ఓట్లు వేస్తే చాలు ఆయన సీఎం అవుతారు. అలాగే ఆయనకు ఉన్న అభిమానుల్లో పావలా పర్సంట్ చూసినా సినిమాకు 60 కోట్లు వస్తాయి. కానీ మాకు అంత వద్దు. నిర్మాత పెట్టిన డబ్బులు వస్తే చాలు. నేను పెట్టినదానికంటే ఎక్కువ వస్తే నువ్వు, డైరెక్టర్ తీసుకో అని నిర్మాత అంటున్నారు... అని శంకర్ తెలిపారు.

  డబ్బులు వస్తే ఇల్లు కొంటాం

  డబ్బులు వస్తే ఇల్లు కొంటాం

  నిర్మాత అలా అనడానికి కారణం మాకు ఇల్లు లేవు. జబర్దస్త్‌లో మా ఫ్రెండ్స్ అందరూ ఇల్లు కొన్నారు. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేవు. అద్దె ఇంట్లో ఉంటున్నామని మా పెళ్లాలు మమ్మల్ని తరిమేశారు. ఈ సినిమాకు డబ్బులు వస్తే మేము ఇద్దరం ఇల్లు కొనుక్కుంటాం.... అని శంకర్ తెలిపారు.

  డబ్బంతా అటే పెట్టాం

  డబ్బంతా అటే పెట్టాం

  నేను ఇల్లు తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకునేవాడిని. కానీ నేను సంపాదించుకున్న డబ్బు అంతా నా ఫ్రెండ్స్ కోసం పెట్టాను. హైదరాబాద్ లో ఉన్న సినిమా వాళ్లే నా ఫ్రెండ్స్. డైరెక్షన్ డిపార్టుమెంట్ నుండి ఆర్టిస్టుల వరకు అందరూ నా ఫ్రెండ్సే అని శంకర్ తెలిపారు.

  శంకర్ అందరికీ దానాలు చేసేవాడు

  శంకర్ అందరికీ దానాలు చేసేవాడు

  దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ... శంకర్ ఇప్పటి వరకు ఇల్లు కొనకపోవడానికి కారణం.... తనకు రెమ్యూనరేషన్ రూపంలో వచ్చిన డబ్బులో దాదాపు సగం క్రేన్ డిపార్టుమెంటుకు, ప్రొడక్షన్ డిపార్టుముంటుకు ఇచ్చేస్తుంటాడు. జబర్దస్త్ చేసేపుడు మా కంటెస్టెంట్లు నలుగురు ఉంటే 15 మంది వచ్చి ఇంట్లో భోజనం చేసేవారు. వాళ్ల ఫ్రెండ్స్, వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్, వాళ్ల ప్రాబ్లమ్స్, వాళ్ల అకౌంట్ నెంబర్స్ తీసుకుని డబ్బులు వేసేవారు. ఇదేం పైత్యం అంటే తెలియదు అనేవాడు. అని తెలిపారు. వెంటనే శంకర్ మైకు అందుకుని.... ఈ సారి కష్టపడి కథ రాసుకుని హిట్ కొడుతున్నాం. ఇల్లు కొంటున్నాం అని వ్యాఖ్యానించారు.

  నేను అందరి ఫ్యాన్స్ చూసే శంకర్

  నేను అందరి ఫ్యాన్స్ చూసే శంకర్

  మా దేవుడు కళ్యాణ్ బాబు ఇచ్చిన సపోర్టు జీవితాంతం మరిచిపోలేను. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, బన్నీ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ హీరోల ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా కోసం వెయిటింగ్ అని సందేశాలు పంపుతున్నారు. శంకర్ ఏ ఒక్క హీరో ఫ్యాన్స్ చూసే శంకర్ కాదు, అందరి హీరోల ఫ్యాన్స్ చూసే శంకర్. అందరి ఫ్యాన్స్ కు నేను ఇష్టం. ఎందుకంటే నేను ఎవరినీ ఏమీ అనలేదు. నన్ను ఎంకరేజ్ చేయండి, నేను బావుంటే నా వెనక పది మంది బావుంటారు.... అని శంకర్ చెప్పుకొచ్చారు.

  English summary
  Shakalaka Shankar inteesting speech at Shambho Shankara Pre release. Jabardasth fame actor Shakalaka Shankar is coming before the audience with this movie as a lead hero. Karunya is playing the leading lady in the film which is bankrolled by Ramana Reddy and Suresh Kondeti under the banner of R R Pictures and SK Pictures. Rajasekhar has handled the camera work and Sai Karthik has composed the music for the film. The makers have announced that the film will be released on June 29, 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more