»   » షకీలాని మోసం చేసిన మేనేజర్

షకీలాని మోసం చేసిన మేనేజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పర్శనల్ గా కూడా తన జీవితంలో ఎంతో నష్టపోయానని, తన మేనేజర్ తో పాటు సొంత వారు కూడా తన డబ్బు తీసుకొని తనను మోసం చేశారని తెలిపింది షకీలా.
తొంభవ దశకంలో తెలుగు,తమిళ, మళయాళ పరిశ్రమలలో సంచలనం సష్టించిన శృంగార తార షకీలా. చాలా కాలం తర్వాత పరిశ్రమలోని పరిస్థితులపై మాట్లాడింది.

పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వరుస ఫెయిల్యూర్స్ లో కలెక్షన్స్ లేక ఇబ్బందిగా ఉన్న సమయంలో కూడా తన సినిమాలతో మంచి వసూళ్లను రాబట్టిన షకీలా ఆ తరువాత తన సినిమాల హవా తగ్గటానికి కారణాలు విశ్లేషించింది.

షకీలా మాట్లాడుతూ.... ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో కూడా గ్లామర్ పాళ్లు బాగానే ఉన్నప్పటికీ తన సినిమాలనే అశ్లీల చిత్రాలుగా చూపించారని,ముఖ్యంగా మళయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీలకు సరైన గౌరవం లేకపోవటం, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కావటం మూలంగానే ఇలా జరిగిందని తెలిపింది.

అయితే ఇప్పటికీ అప్పటికీ పెద్ద మార్పేమీ రాలేదని, ఇప్పటికీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయని చెప్పుకొచ్చింది షకీలా. అయితే ఈ జనరేషన్ హీరోయిన్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది.

అలాగే ఇప్పుడున్న వాళ్లు ఎక్కువ కాలం పరిశ్రమలో కొనసాగకపోయినా ఉన్నంతలో మంచి ఫేమ్ తో పాటు డబ్బు సంపాదించుకొని తరువాత ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని, ఇది చాలా మంచి పరిణామమంటోంది.

Shakeela cheated by her manager

సెక్సీ డాల్‌గా గుర్తింపు పొందిన షకీలాకు అభిమానులు ఎక్కువే! ఆమె రాజకీయ ఆరంగేట్రం కోసం వారు కూడా ఎదురు చూస్తున్నారట. 1973 నవంబర్ 19న పుట్టిన షకీలా సాఫ్ట్ కోర్, బి టైప్ మూవీస్‌లలో నటించింది. ప్రధానంగా మలయాళం, తమిళ్, తెలుగు, పంజాబీ, కన్నడ తదితర భాషా చిత్రాలలో నటించింది. ఆమె బి గ్రేడ్ చిత్రాలలో 1990లలో నటించింది.

ఆ తర్వాత చెన్నై వెళ్లిన ఆమె సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించింది. ప్రధానంగా తొలుత తమిళ సాఫ్ట్ పోర్న్ చిత్రాలలో నటించింది. ఆమె తన ఇరవయ్యో ఏట ప్లే గర్ల్ చిత్రంలో సహాయ నటి పాత్ర పోషించింది. ఈ చిత్రం పోర్న్ మూవీ. ఈ చిత్రంలో సిల్క్ స్మిత ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత పలు బి గ్రేడ్ చిత్రాల్లో షకీలా నటించింది. కిన్నరతుంబికల్ చిత్రం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమె మళయాలంలో నటించిన పలు చిత్రాలు ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయి.

English summary
Actress Shakeela got Cheated by her Manager .
Please Wait while comments are loading...