»   » టార్గెట్ చేసారు : ఆపమంటూ షకీలాకు బెదిరింపులు

టార్గెట్ చేసారు : ఆపమంటూ షకీలాకు బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమ గురించి ఏమైనా బయిటపడుతుంది అనుకున్నప్పుడు బెదిరింపులుకు దిగటం సహజం. ముఖ్యంగా వాస్తవ పరిస్దితులను ప్రతిబింబిస్తూ సినిమాలను తీసేటప్పుడు అవి ఎక్కువ అవుతాయి. తాజాగా షకీలా డైరక్ట్ చేస్తున్న చిత్రంలో ఉన్న సన్నివేశాల వలన తమకు ఇబ్బంది ఎదురువుతుంది అని భావించిన కొందరు పొలిటీషియన్స్ బెదిరింపులకు దిగుతున్నారట. ఈ విషయాన్ని ఆ చిత్రం నిర్మాత తెలియచేసారు.

స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను,అన్యాయాలను ప్రశ్నించిన ఓ మహిళ కథే 'రొమాంటిక్ టార్గెట్'. షకీలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నరేశ్, శ్వేతాషైనీ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Shakeela's romantic target get problems

సమర్పకులు సయ్యద్ అఫ్జల్ మాట్లాడుతూ-''షకీలా గారు చెప్పిన దాని కన్నా ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఈ కథ తెలిసిన కొంతమంది రాజకీయనాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వెనుకాడం'' అని అన్నారు.

నరేశ్‌, శ్వేత, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా నటి షకీలా రూపొందిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌ టార్గెట్‌'. సయ్యద్‌ అఫ్జల్‌ సమర్పణలో సత్యం క్రియేషన్స్‌ పతాకంపై మెంటా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో తయారవుతోంది. డబ్బింగ్‌ పనులు పూర్తయిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

షకీలా మాట్లాడుతూ ‘‘నేటి సమాజంలో తమపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలపై ఆడవాళ్లు ఓ మహాశక్తిగా మారి ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులోని ప్రధానాంశం. యాక్షన్‌, క్రైమ్‌, సస్పెన్స్‌, రొమాన్స్‌ మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచాం'' అని చెప్పారు.

షకీలా, బాబాభాయ్‌, కావేరి, స్వప్న, ఆరోహి, శేషు, స్వామి, ఆజాద్‌, సత్యం, రాధాకృష్ణ, జల్లేపల్లి వెంకటేశ్వరరావు, అశోక్‌, దేవి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సాయి, నండూరి వీరేశ్‌, పాటలు: బొబ్బా, శ్రీవాస్తవ్‌, సంగీతం: కార్తీక్‌, అభిషేక్‌, ఛాయాగ్రహణం: కంకణాల శ్రీనివాసరెడ్డి, సహ నిర్మాత: జల్లేపల్లి నరేశ్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: షకీలా.

English summary
Shakeela is wielding megaphone for a movie, that seems to have got a perfect title 'Romantic Target.' Romantic target will be simultaneously released in many languages including Telugu, Tamil and Hindi besides Malayalam. The movie is on floors and will release in October.
Please Wait while comments are loading...