»   »  డ్రగ్ కేసులో విలన్ కొడుకు అరెస్టు

డ్రగ్ కేసులో విలన్ కొడుకు అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shakti Kapoor
ముంబయి నార్కొటిక్స్ డిపార్ట్ మెంట్ జుహూలో జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై నిన్న దాడి చేసి ఎనిమిది మంది డ్రగ్స్ సప్లయి చేస్తున్న వారిని అరెస్ట్ చేసారు. వారిలో హిందీ చిత్రాల్లో విలన్ వేషాలు వేసే శక్తి కపూర్ కుమారడు సిధ్ధార్ధ ఉండటం భాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. తమ పిల్లలు తమ వెనక తాము రాత్రింబవళ్ళు సంపాదించిన డబ్బుతో ఏం చేస్తున్నారో అని అందరూ చెక్ చేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఆ పార్టీలో పాల్గొన్న మరో 230 మందిని హాస్పటిల్స్ కి పంపి డ్రగ్స్ తీసుకున్నారో లేదో అని టెస్టింగ్ కి పంపారు. సిద్దార్ధ ఆ నైట్ క్లబ్ లో మ్యూజిక్ ప్లే చేస్తూంటాడు.

అయితే దీనిపై శక్తి కపూర్ ని కలిసిని మీడియా వివరణ కోరగా..నా కొడుకు అమాయికుడు..వాడు డిస్కో జాకీ..అనేక చోట్లకు తిరుగుతూంటాడా. అయితే నేను మాత్రం డ్రగ్స్ కి పూర్తిగా వ్యతిరేకం.నిజంగా వాడు ఆ పని చేసుంటే ఏక్షన్ తీసుకోండని చెప్తున్నాడు.అలాగే అరెస్టు చేసిన అమ్మాయిల్లో బాలీవుడ్ ఆర్టిస్ట్ ఆదిత్యా పంచోలి..జరీనా వహీబ్ ల కూతరు సనా పంచోలి కూడా ఉంది. అయితే ఈ ఇష్యూపై ఆదిత్య కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఇక ఈ సంఘటన టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ కూడా కంగారుపుట్టించింది. కొందరు తమ పిల్లలు ఎప్పుడూ పబ్స్,నైట్ క్లబ్స్ అంటూ తిరగటాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X