»   » స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకొన్న హీరో...!

స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకొన్న హీరో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యుగానికి ఒక్కడు" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన కార్తీ ఆ తర్వాత వచ్చిన 'ఆవారా"తో అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన 'నా పేరు శివ"తో తెలుగు హీరోలతో సమానంగా అందరి ఆదరణ పొందుతున్నాడు. ఈ మూడు సినిమాలూ స్టూడియో గ్రీన్ బేనర్ పై కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.

మళ్ళీ ఇదే బేనర్ లో మరో అనువాద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. తమిళంలో రూపొందుతున్న 'శగుణి" చిత్రాన్ని తెలుగులో 'శకుని" పేరుతో స్టూడియో గ్రీన్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన లోగో లాంచ్, ట్రెలర్ రిలీజ్ కార్యక్రమం సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో ఘనంగా జరగబోతోంది. రాజకీయ నేపథ్యంలో సాగే సెటైరికల్ మూవీ ఇది. మరి ఈ సినిమాతో కార్తీ హీరోగా ఏ రేంజ్ కి వెళ్తాడో చూడాలి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా కార్తీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కసన్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమాచారం.

English summary
Kollywood handsome star actor Karthi who has entered in tollywood with dubbing movies like Yuganiki Okkadu,Awara,and now Naa Peru Shiva seems to do a direct telugu movie as his dubbing movies are doing good business at tollywood box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu