»   » ఐటెంసాంగ్‌లో అమ్మాయిలా.. శమంతకమణి.. యూట్యూబ్‌లో సంచలనం

ఐటెంసాంగ్‌లో అమ్మాయిలా.. శమంతకమణి.. యూట్యూబ్‌లో సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన శమంతకమణి మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. భవ్య క్రియేషన్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్‌లో రెండో స్థానంలో నిలిచింది. గత 24 గంటల్లోనే వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తున్నది.

యూట్యూబ్‌లో విజృంభణ

యూట్యూబ్‌లో విజృంభణ

యూట్యూబ్‌లో సునామీలా విజృంభిస్తున్న శమంతకమణి మోషన్ పోస్టర్‌పై నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్, దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్యలు స్పందించారు. మల్టీ స్టారర్ నేపథ్యంలో ఓ డిఫెరెంట్ కథను వినిపించగానే నిర్మాత వీ ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పొందుతారు. ప్రతీ క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతారు అని దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెలిపారు.


కథ, కథనం కొత్తగా..

కథ, కథనం కొత్తగా..

శమంతకమణి కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. రొటీన్ సినిమాలాగా ఉండదు. ఈ చిత్రంలో విభిన్నమైన అంశాలు ఉంటాయి. . ఈ మూవీ కోసం అంకుఠిత దీక్షతో పనిచేశాం. చాలా కష్టపడ్డాం. దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆ విషయాన్ని మోషన్ పిక్చర్ ప్రూవ్ చేసింది. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని శ్రీరామ్ ఆదిత్య ధీమా వ్యక్తం చేశారు.


మోషన్ పోస్టర్‌లో ఏముందంటే..

మోషన్ పోస్టర్‌లో ఏముందంటే..

పాత సినిమాలో ఐటెం సాంగ్‌లోని అమ్మాయి పేరులా ఉంది. శమంతకమణి ఎంటండీ.. నాది సేమ్ ఫీలింగ్. శమంతకమణా? ఇదేదో పురాణాల్లో కథలా ఉందే. బ్రదర్ అక్కడ పడింది ఆ బొమ్మ కాదు అనే డైలాగ్స్ మోషన్ పిక్చర్‌లో వినిపిస్తాయి. ఆ తర్వాత మంచి లగ్జరీ కారు వీడియోలో కనిపిస్తుంది. ఈ మోషన్ పిక్చర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్‌గా ఉంది. మోషన్ పిక్చర్ చూడగానే కొత్తగా ఏదో ప్రయత్నించారనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది.


నలుగురు హీరోల కాంబినేషన్‌లో..

నలుగురు హీరోల కాంబినేషన్‌లో..

టాలీవుడ్‌లో యువ హీరోలు నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్ కాంబినేషనే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నది. ఏదో బలమైన కథ లేకపోతే నలుగురు హీరోలు ఒకే తెరపైన కనిపించడం సాధ్యం కాదు అనే భావన కలుగుతుంది. అందుకు సాక్ష్యంగా శమంతకమణి మోషన్ పోస్టర్ నిలిచింది. ఈ మోషన్ పోస్టర్ చూసిన వారిలో సినిమా చూడాలనే ఆసక్తి, కుతుహలం పెరగడం చాలా సహజమనే మాట వినిపిస్తున్నది.English summary
The latest Motion Poster of Shamntakamani by Bhavya Creations to be creating a buzz in the city starring Nara Rohith, Sundeep Kishan, Sudheer Babu, Aadi Saikumar on the lead. Trending on the No.2 spot on YouTube, this Motion Poster seems to have caught the eye of the audience and has received a positive feedback in the last 24 hours on social media rostrum.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu