»   » ‘శమంతకమణి’ టీజర్ సూపర్బ్... (వీడియో)

‘శమంతకమణి’ టీజర్ సూపర్బ్... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం శ‌మంత‌క‌మ‌ణి. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది ఈ చిత్రంలో డిఫరెంటుగా కనిపించబోతున్నారు.ఈ సినిమాలో నలుగురు హీరోలకు ప్రామినెంట్ రోల్ ఉంటుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని దర్శకుడు శ్రీరామ్ క‌థ‌ను రాసుకున్నాడట. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మ‌రో వైపు ఉత్కంఠ రేకెత్తించే విధంగా సినిమా స్క్రీన్ ప్లే ఉంటుందట.


ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చాందినీ చౌద‌రి, జెన్నీ హ‌నీ, అన‌న్యా, సోనీ, ఇంద్ర‌జ‌, క‌స్తూరి, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌, సురేఖావాణి, స‌త్యం రాజేశ్‌, బెన‌ర్జీ, అదుర్స్ ర‌ఘు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారుల్లో న‌టించిన ఈ సినిమాకు సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామ‌లై, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి, నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌, క‌థ - స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.


English summary
Shamantakamani Official Teaser. Shamantakamani Telugu Movie features Sudheer Babu, Sundeep Kishan, Nara Rohit and Aadi in lead roles. Directed by Sriram Adittya, Music composed by Mani Sharma and produced by V. Ananda Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu