»   » ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ అంశాలతో శమంతకమణి

ఊహించని ట్విస్టులు.. థ్రిల్లింగ్ అంశాలతో శమంతకమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో రూపొందుతున్న 'శమంతక మణి' చిత్రం జులై 14 న విడుదలకు సిద్ధమవుతోంది. 'భలే మంచి రోజు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో భవ్య క్రియేషన్స్ పతాకం పై v. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత ఆనంద్ మోహన్ వెల్లడించారు.

దమ్మున్న కథ ఇది..

దమ్మున్న కథ ఇది..

ఈ సందర్భం గా నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ "హీరోలుగా చాలా బిజీ గా ఉన్న నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది ఈ మల్టీ స్టారర్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే , ఈ కథలో ఉన్న దమ్ము ఏంటో అర్థమవుతోంది. ఎవరూ ఊహించని మలుపులతో , పుష్కలమైన థ్రిల్లింగ్ అంశాలతో ఉన్న ఈ సినిమా కచ్చితంగా క్లాస్ నీ , మాస్ నీ, ఆకట్టుకుంటుంది. పురాణాల్లో పాపులరైన 'శమంతకమణి' గురించిన కథ కాదు ఇది. అసలు ఈ 'శమంతకమణి' ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది." అని తెలిపారు.


ఆసక్తిని రేకెతిస్తుంది..

ఆసక్తిని రేకెతిస్తుంది..

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ - 'ఇందులో నారా రోహిత్ పాత్ర పేరు ఇనస్పెక్టర్ రంజిత్ కుమార్ . ఇంతకుముందు ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ పేరుతో పోలీస్ పాత్రలు చేసి సెన్సేషన్ సృష్టించారు. నారా రోహిత్, పాత్ర చిత్రణ , ఆటిట్యూడ్ చాలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక సుధీర్ బాబు చేసిన కృష్ణ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది.


పక్కింటి కుర్రాడిగా

పక్కింటి కుర్రాడిగా

కార్తీక్ పాత్రలో నటించిన ఆది మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. కోటిపల్లి శివగా సందీప్ కిషన్ మంచి మాస్ పాత్ర పోషించారు. ఈ నలుగురి పాత్రల మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ వీరు నలుగురూ కలుసుకునే సందర్భం , వీళ్ళ మధ్య నడిచే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగానూ ఉంటాయి. " అని చెప్పారు.


తెరముందు.. తెరవెనుక

తెరముందు.. తెరవెనుక

చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ళ భరణి, హేమ, సురేఖ వాణి, సత్యం రాజేష్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం :మణిశర్మ,కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్స్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.English summary
Shamanthakamani movie produced by V Anand Mohan. He said that This movie is full of Twists and Turns. Nara rohith, Sandheep Kishan, Sudheer Babu, Aadi are acting in this multi starrer movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu