For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దిగజారుడు: పోస్టర్స్ లో మరీ ఇంత బూతా? (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఏ సినిమా పబ్లిసిటీకైనా పోస్టర్లే ప్రధాన ఆయుధం. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల మదిని చూరగొనేవి కూడళ్లల్లో ఏర్పాటు చేసే పోస్టర్లే. చలనచిత్రాల ప్రచారమంటూ హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శనలకు ఇటీవల బాలీవుడ్‌,టాలీవుడ్ లలో పట్టం కడుతున్నారు.

  బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్ల రూపంలో ఆబాలగోపాలం నుంచి ముదుసలి వరకు మతులు పోగొట్టే విధంగా సినీ దర్శక, నిర్మాతలు పోస్టర్లు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా బూతుని బ్రహ్మాండంగా చూపే చిత్రాలకు డిమాండ్ మొదలైంది. ఈ కోవలో వరసలో చిత్రాలు వచ్చి పడుతున్నాయి. తక్కువ బడ్జెట్ లో చుట్టేయటం, ఓ వర్గాన్ని ఆకర్షించటం ఈ చిత్రాల లక్ష్యం. ఈ కోవలో 'కౌసల్య ఆంటీ', ఓ ఆంటీ కథ, అనాగరికం 2, ఈ రోజుల్లో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, వంటి అనేక చిత్రాలు రెడీ అవుతున్నాయి.

  పోస్టర్స్, ఫోటోలు సెక్సీగా వదలటంతోనే ఈ చిత్రాల పబ్లిసిటీ మొదలవుతోంది.. ఎక్కడెక్కడ వాళ్లు ఈ తరహా సాప్ట్ ఫోర్న్ చిత్రాల వల్ల లాభాలు ఖాయం అనే నమ్మకంగా రెడీ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న ఈ తరహా హిందీ, తెలుగు చిత్రాలును పరిశీల్దదాం...

  ఆ విషేషాలు స్లైడ్ షో లో...

  రాజ్‌3: రాజ్‌-3 తొలి పోస్టర్‌లో నటీమణి బిపాసాబసు బికినీ దుస్తుల్లో దర్శనమిస్తారు. ఇది ఒక హార్రర్‌ సినిమా. వెనుక నుంచి ఏవో కొన్ని అదృశ్య చేతులు ఆ శరీరాన్ని తాకుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు.

  హీరోయిన్‌: కరీనాకపూర్‌ టాప్‌, షార్ట్‌ ధరించిన పోస్టర్‌ల్టో కొన్ని మ్యాగజైన్లు, ఖాళీ వైన్‌ గ్లాసులు దర్శనమిస్తాయి.

  జిస్మ్‌2: శృంగార తార సన్నీలియోన్‌ కామసూత్ర పోజ్‌లో తన సహనటుడు రణదీప్‌ హుడాతో ఈ పోస్టర్‌లో కనువిందు చేశారు. ఒకసారి ఈ పోస్టర్‌ను తిలకించినట్లయితే 'భట్‌'లు ఈ సినిమా కోసం సన్నీ లియోన్‌ను ఎందుకు ఎంపిక చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొదటి వారంలో పెద్దఎత్తున వసూళ్లు రాబట్టాలనేదే నేటి దర్శక నిర్మాతల పనిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  హేట్‌ స్టోరీ: ఈచిత్రంలో కథానాయిక వీపు వెనుక భాగంలో టాటూ పొడిపించుకునే దృశ్యాన్ని పోస్టర్‌లో ప్రధానంగా చూపించారు.

  బ్లడ్‌మనీ: నటి అమృతాపూరి బికినీలో దర్శనమిస్తూ తన సహనటుడు కునాల్‌ కెమూతో డబ్బులో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తుంది.

  ద డర్టీ పిక్చర్‌: అందాలరాశి విద్యాబాలన్‌ ఎరుపు రంగు బ్లౌజులో ముగ్గురు నటులు నసీరుద్దీన్‌షా, తుషార్‌కపూర్‌, ఇమ్రాన్‌ హష్మీలతో కనిపించే పోస్టర్‌ ఇది.

  ఖుర్బాన్‌: కరీనా, తన భర్త సైఫ్‌కు అతిదగ్గరయ్యే సన్నివేశం ఈ పోస్టర్‌పై కనిపిస్తుంది.

  మర్డర్‌2: ఇమ్రాన్‌ హష్మీ, శ్రీలంక అందాల తార జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ పోస్టర్‌పై సందడి చేశారు.

  సాహెబ్‌ బాబా ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌: కథానాయిక మహిగిల్‌ తన వీపు వెనుక భాగాన్ని ప్రదర్శిస్తూ పోస్టర్‌పై కనిపిస్తారు.

  జూలి: నెహాధూపియా తన ఒంపుసొంపులు ప్రదర్శించే పోస్టర్‌.

  వహీద, ప్రత్యూష కీలక పాత్రధారులుగా వస్తున్న చిత్రం 'కౌసల్య ఆంటీ'. కాలేజీలో చదువుకునే ఓ అమ్మాయిని ఐదుగురు విద్యార్థులు అత్యాచారం చేసి హత్యచేస్తారు. ఆ అమ్మాయి అక్క కౌసల్య వాళ్ళపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది. తన అందంతో వారిని బంధించి ఎలా హతమార్చింది? అనేది ఆసక్తికరం అని కథ చెప్తున్నారు.

  సోనీ, శిరీష ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ‘ఓ ఆంటీ కథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్‌ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘అక్రమ సంబంధం ఎన్ని అనర్థాలకు దారితీస్తుంది అనే అంశంతో తెరకెక్కించిన చిత్రమిది అని ఈ చిత్రం కథ చెప్తున్నారు.

  నూతన తారలు కిరణ్‌కుమార్, లిజా జంటగా నటించి విడుదలైన చిత్రం 'ఈ రోజుల్లో రొమాంటిక్ క్రైమ్ స్టోరి'. సినిమా ప్లాప్ అయినా టైటిల్ మాత్రం వార్తల్లో నిలిచింది.

  ఈ సినిమాలు చాలవన్నట్లు కన్నడలో మంచి విజయం సాధించిన ‘దండు పాళ్యం' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేసారు. కన్నడ హీరోయిన్ పూజా గాంధీ... థియోటర్ వరకూ జనాలని లాక్కెళ్లింది.

  English summary
  Bollywood filmmakers are zooming in on women's curves to create titillating posters, aimed at crucial first week collections, perhaps emboldened by today's liberal censors. The first look of Vikram Bhatt's production Hate Story creates a mystery about the woman in the picture but sends out the right message about the film's content - bold and daring. It has a mystery girl with her bare, tattooed back visible and a gun placed strategically at the back of her jeans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X