»   » డ్యాన్స్‌ ప్రాక్టీస్‌: పడి ముక్కుకి ఫ్రాక్చర్‌ అయి కుట్లు (ఫొటో)

డ్యాన్స్‌ ప్రాక్టీస్‌: పడి ముక్కుకి ఫ్రాక్చర్‌ అయి కుట్లు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: బాలీవుడ్‌ నటి షమితా శెట్టి(శిల్పాశెట్టి సోదరి) డ్యాన్స్‌ రియాల్టీ షోలో గాయపడిన విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ ఛానల్‌లో ప్రసారమవుతున్న 'ఝలక్‌ దిఖ్‌లాజా' రియాల్టీ షోలో షమితా శెట్టి పాల్గొంటోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ క్రమంలో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కింద పడిపోయింది. దీంతో ఆమె ముక్కుకి ఫ్రాక్చర్‌ అయి కుట్లు పడినట్లు సోదరి శిల్పా ట్విట్టర్‌లో తెలిపింది. ఇంతకుముందు బిగ్‌బాస్‌ కార్యక్రమంలో కనిపించిన షమితా, ఇప్పుడు డ్యాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి అటు బాలీవుడ్ లో ఓ వూపు ఊపడంతో పాటు, టాలీవుడ్ లో జనాలను ఆకట్టుకుంది. ఆమె చెల్లెలు షమితా శెట్టి మాత్రం సినిమాల్లో రాణించ లేక పోయింది.

Shamita Shetty fractures her nose during ‘Jhalak Dikhhla Jaa’ rehearsals

 
బాలీవుడ్‌ నటి షమితా శెట్టి 'క్యాష్‌' సినిమా తర్వాత సినిమాలకి దూరంగా ఉండి కొంత కాలంపాటు ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై దృష్టిసారించింది. అయితే ప్రసుతం 'ఝలక్‌ దిక్‌లాజా' డ్యాన్స్‌ రియాల్టీషోలో పాల్గొననున్నట్లు ఆమె సోదరి శిల్పా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

శిల్పాకి రియాల్టీ షో 'బిగ్‌ బ్రదర్‌' బాగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు షమితాకి కూడా టీవీ డ్యాన్స్‌ షో కలిసొస్తుందేమో చూడాలంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది.

English summary
SHILPA SHETTY ‏ twetted: "Terrible news,freak accident that happnd with ShamitaShetty jhalak rehearsals. Nose fracture and 2 stitches😣Amazed at Ure determination"
Please Wait while comments are loading...