Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీటు చివరన కూర్చున్నా: ఖాకీపై దర్శకుడు శంకర్ ట్వీట్
ఊపిరి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోను మెప్పించారు తమిళ నటుడు కార్తీ. ఆ తర్వాత వచ్చిన చెలియా, అంతకుముందు వచ్చిన కాష్మోరా చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టులేకపోయాయి. ప్రస్తుతం మరోసారి పవర్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ ఖాకి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీకి జంటగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

వాస్తవ కథ ఆధారంగా
వాస్తవ కథ ఆధారంగా చేసుకొని పరిశోధనాత్మక చిత్రంగా ఖాకి నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 90వ దశకంలో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా హెచ్.వినోద్ తెరకెక్కించిన ఈ కాప్ స్టోరీ... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

డేరింగ్ పోలీస్ ఆఫీసర్
పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఒక ముఠాను అంతమొందించడానికి ఓ డేరింగ్ పోలీస్ ఆఫీసర్, అతడి టీమ్ చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

పొగడ్తలతో ముంచెత్తారు
తాజాగా, ఆ చిత్రంపై ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆ చిత్ర దర్శకుడు వినోద్, హీరో కార్తిని పొగడ్తలతో ముంచెత్తారు. "ఖాకి" సినిమాకు శంకర్ జై కొట్టారు. ఆ సినిమాలో హీరో కార్తితో పాటు చిత్ర యూనిట్ అంతా కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు.

తీరన్ అధిగారమ్ ఒండ్రు
ఆ చిత్రంపై శంకర్ తన అభిప్రాయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. ఆ సినిమాను వినోద్ అద్భుతంగా తెరకెక్కించారన్నారు. "తీరన్ అధిగారమ్ ఒండ్రు" తెలుగులో ఖాకి అద్భుతమైన పోలీసు సినిమా. థియేటర్లో తర్వాత సన్నివేశం ఏంటి?.. అనే ఆతృతతో సీట్ చివర్లో కూర్చోవాల్సిన పరిస్థితి.
|
మొత్తం చిత్ర బృందం
దర్శకుడు హెచ్. వినోద్ చాలా కష్టపడి తెరకెక్కించారు. కార్తి, జిబ్రన్, డీవోపీ, మొత్తం చిత్ర బృందం చక్కగా పని చేశారు' అని శంకర్ ట్వీట్ చేశారు. దిగ్గజ దర్శకుడు ఖాకీ టీమ్ కు తెలిపిన శుభాకాంక్షల ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.