»   »  స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రజనీకాంత్ మరోసారి!

స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రజనీకాంత్ మరోసారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రజనీకాంత్ అంటేనే సౌతిండియాలో ఓ బ్రాండ్. ఆయన నటించిన సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు ఎంతో వైవిద్యంగా, వినోదాత్మకంగా ఉంటూ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కాల్సిందే.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రోబో' సినిమా రూ. 100 కోట్లకు మించిన బడ్జెట్‌తో నిర్మాణం అవడంతో పాటు....దేశ వ్యాప్తంగానే కాకుండా, ఇతర దేశాల్లోనూ సక్సెఫుల్‌గా ప్రదర్శితమై ఊహించని రేంజిలో భారీ లాభాలను తెచ్చి పెట్టింది. తాజాగా రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు.

ప్రస్తుతం 'ఐ'(తెలుగులో 'మనోహరుడు') చిత్రం రూపకల్పనలో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ తన తర్వాతి సినిమాను రజనీకాంత్‌తోనే తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. రజనీకాంత్ కూడా ఆయతో మరోసారి కలిసి పని చేయడాని సిద్దంగానే ఉన్నట్లు టాక్. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'కొచ్చాడయాన్' చిత్రం విడుదల కోసం రజనీ అభిమాన లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

English summary

 If news coming from the Tamil film industry has to be believed, once again Superstar Rajinikanth and ace director Shankar are going to join hands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu