For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వచ్చేసింది: విక్రమ్ 'ఐ' ట్రైలర్ (వీడియో)

  By Srikanya
  |

  చెన్నై: ఇప్పుడూ...అప్పుడూ అంటూ ఎన్నాళ్లుగానో వూరిస్తున్న చిత్రం 'ఐ'. విక్రమ్‌, శంకర్‌ కలయికలో 'అపరిచితుడు' తర్వాత వస్తున్న ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకొంటోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బోలెడన్ని విడుదల తేదీలు మార్చేసింది. సంక్రాంతి పండగని పురస్కరించుకొని జనవరి 9న విడుదల చేసేందుకు తాజాగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కొత్త టీజర్ నిన్న రాత్రి విడుదలైంది. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

  మరో ప్రక్క ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎంత వరకూ రిలీజవుతుందనేది తెలియటం లేదు. తమిళంలో విడుదలైతే అవ్వొచ్చేమో కానీ... తెలుగులో మాత్రం ఆ సినిమాకి అడ్డంకులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. కీలకమైన సంక్రాంతి పండగకి ఆ సినిమా విడుదలైతే తెలుగు చిత్రాల వసూళ్లకి గండి పడే అవకాశం ఉంది కాబట్టి 'ఐ'ని కొన్నాళ్లపాటు వాయిదా వేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం అందుతోంది.

  https://www.facebook.com/TeluguFilmibeat

  తమిళనాడులో పండగల సమయంలో ఇతర భాషల చిత్రాల్ని ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పుడు అదే నిబంధనని తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే 'ఐ'ని చూడటం మరింత ఆలస్యమవుతుంది.

  'ఐ' చిత్రం విషయానికి వస్తే..

  విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఐ (తెలుగులో మనోహరుడు) చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం చెన్నైలో విడుదల చేసిన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది.

  విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.150 కోట్ల పైచిలుకు వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. విదేశీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు.

  'ఐ'లో విక్రమ్‌ సరసన అమీ జాక్సన్‌ నటించింది. శంకర్‌ దర్శకత్వం వహించారు. ఎన్‌.వి.ప్రసాద్‌, పరాస్‌జైన్‌ కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకుడు. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో విక్రమ్‌ ధరించిన వేషాలు చూసి ప్రేక్షకులు విస్మయానికి గురయ్యారు.

  వెండితెరపై సాంకేతిక మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంటారు దర్శకుడు శంకర్‌. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని ముగ్ధుడిని చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చిత్రాల్ని తీర్చిదిద్దుతుంటారు. విక్రమ్‌తో తీస్తున్న 'ఐ' కోసం పలు విదేశీ కంపెనీలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

  దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్‌ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్‌ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్‌ నటించాడు'' అన్నారు.

  Shankar's 'I' Theatrical Trailer

  విక్రమ్‌ మాట్లాడుతూ ''శంకర్‌ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.

  శంకర్, విక్రమ్ సినిమాలకి తమిళం తర్వాత మళ్లీ అదేస్థాయిలో ఫ్యాన్ బేస్, మార్కెట్ వున్న ఏరియా తెలుగు పరిశ్రమ. అందుకే తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించడం కోసం ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ బయిటకు వచ్చి తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో , తమిళ మీడియాలో నలుగుతోంది.

  కథేమిటంటే...

  ప్రముఖ కండల వీరుడు, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ మేటి కండల వీరుడు కావాలనేది లింగేశన్‌ అనే యువకుడి కల. దీని కోసం ఎంతో కష్టపడతాడు. తన కల నెరవేరుతుందన్న సమయంలో అనుకోకుండా ఓ అడ్డంకి ఎదురవుతుంది. అదేంటి.. దాన్నుంచి ఎలా బయటపడ్డాడు. తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఐ'.

  English summary
  Already teasers of his most awaited multi-crore spectacular 'I' has stunned cine world. Here comes the theatrical trailer of the movie, a shocker that what its teaser was.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X