»   »  షారూక్-శంకర్ ల మధ్య విభేదాలు

షారూక్-శంకర్ ల మధ్య విభేదాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

శివాజీ సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర దర్శకుడు శంకర్ తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని అందరూ ఎదురు చూశారు. శివాజీ సినిమా విడుదలైన తరువాత శంకర్ తన తదుపరి ప్రాజెక్టేమిటో స్వయంగా చెప్పాడు. షారూక్ ఖాన్ హీరోగా రోబోట్ అనే చిత్రాన్ని రూ.100 కోట్లతో నిర్మించనున్నట్టు చెప్పాడు.

అయితే ఆ సినిమా లేదని గురువారం హీరో షారూక్ ఖాన్ స్వయంగా చెప్పాడు. కింగ్ ఖాన్ ఈ సినిమా వార్తను మూడు నెలల క్రితమే ప్రకటించాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథ ఆధారంగా రూపొందడానికి శంకర్ కథను రూపొందించుకున్నారు. చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నా అన్నిటినీ రద్దుచేసుకుని శంకర్ రోబోట్ కోసం ఖాన్ సమయాన్ని కేటాయించడానికి సిద్ధపడ్డాడు. ఈ చిత్ర తొలి షెడ్యూల్ 2008 ప్రారంభంలో మొదలుకాల్సిఉంది. అయితే శంకర్, షారూక్ ల మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే ఈ సినిమా రద్దయినట్టు తెలుస్తోంది. షారూక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ...శంకర్ రోబోట్ చత్ర కథ చెప్పినపుడు థీమ్ బాగా నచ్చింది..సినిమా పూర్తయితే ఒక హాలీవుడ్ సినిమాలా ఉంటుందనుకున్నాను...అయితే ఇపుడు స్క్రిప్ట్ లో మార్పులు చేశారు...ఆ మార్పులు సినిమా ఫలితం మీద కచ్చితంగా ఉంటుంది..అందుకే ఆ సినిమా చేయకుండా బయటకు వచ్చాను..అన్నారు.
నిజానికి ఈ సినిమా కమల్-శంకర్ ల కాంబినేషన్ లో పెంటామీడియా ప్రొడక్షన్ హౌస్ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఎందుకోగానీ అది సఫలీకృతం కాలేదు. ఇపుడు రోబోట్ ప్రాజెక్ట్ నుంచి షారూక్ ఖాన్ తప్పుకున్నారు. ఈ పరిణామంతో శంకర్ నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. షారూక్ స్థానంలో మరో హీరోను ఎంచుకుని సినిమాను ప్రారంభిస్తారా లేక బుట్టలో వేసి కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారా అన్నది వేచి చూడాల్సిందే.

Read more about: shankar shahrukh khan robot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X