»   »  పవన్ కళ్యాణ్ విషెష్ చెప్పారంటూ హ్యాపీగా ట్వీట్

పవన్ కళ్యాణ్ విషెష్ చెప్పారంటూ హ్యాపీగా ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ...విషెష్ చెప్పి మెచ్చుకున్నారంటే ఆ క్రేజే వేరు. అటువంటిదే కోన వెంకట్ తాజా చిత్రానికి లభించింది. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ‘శంకరాభరణం' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసి, ప్రారంభించరని తెలియగానే ...విషెష్ చెప్పారు. ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్వీట్ ద్వారా తెలియచేసారు. మీరూ కోన చేసిన ట్వీట్ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘‘స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య'' చిత్రాలతో తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న నిఖిల్ రచయిత కోనవెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఉద‌య్ నంద‌న‌వ‌నం ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

‘శంకరాభరణం' అనే లోగో, హీరో హీరోయిన్లు నిఖిల్, నందితలు పరిగెడుతుంటే వెనక కొంతమంది రౌడీలు వెంటపడడం.. ఇలా పోస్టర్‌తోనే హైప్ క్రియేట్ చేసారు.

PAWANKALYAN

బీహార్ నేపథ్యంలో సాగే మరో సరికొత్త క్రైం కామెడీ సినిమా ఇది. ఈ సినిమాకు ‘శంకరాభరణం' అనే టైటిల్ పెట్టిన రోజునుంచే అంతటా మంచి ఆసక్తి రేకెత్తింది. తెలుగులో స్టార్ రైటర్‌గా వెలుగొందుతున్న కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందే ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి.

గత కొద్దిరోజులుగా జరుగుతున్న స్క్రిప్ట్‌ పనులను పూర్తి చేసిన శంకరాభరణం టీమ్ ఈ రోజే షూటింగ్ మొదలుపెట్టింది. నార్త్ ఇండియాలోని సినిమా కథకు సరిపోయే పలు లొకేషన్లను ఈ మధ్యే ఎంపిక చేశారు. ఇక ఈ ఉదయం నుంచే షూటింగ్ మొదలైంది. ఉదయం మొదటి షాట్ ఓకే అయిన వెంటనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

 Shankara Bharanam: wishes from PAWANKALYAN

క్రైమ్ కామెడీ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన నందిత‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు కోనవెంకట్ ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో అతిధి పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటిస్తోందని కోన తెలిపారు. అంజలికి ‘గీతాంజలి' చిత్రంతో కోన మంచి విజయాన్ని అందించారు. ఆ మేరకే అంజలి ‘శంకరాభరణం' చిత్రంలో గెస్ట్ రోల్ వేయడానికి సిద్థపడిందని సమాచారం.

English summary
Kona Venkat tweeted : "Received wishes from the Power Star PAWANKALYAN for our Shankarabharanam 👏👏what a way to begin our journey!!"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu