»   » నారా రోహిత్ ‘శంకర’ ఎంతవరకూ వచ్చింది?

నారా రోహిత్ ‘శంకర’ ఎంతవరకూ వచ్చింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రవౌళీ ప్రసాద్ నిర్మిస్తున్న 'శంకర' చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రవౌళి మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన పాట త్వరలో చిత్రీకరిస్తామని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఆడియో విడుదల చేసి నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, కొత్త నిర్మాత అయిన చంద్రవౌళి చక్కగా నిర్మించారని, తన కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని హీరో రోహిత్ తెలిపారు.

దర్శకుడు తాతినేని సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు.


ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్. నారాయణ, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, చిన్నా, మహర్షి రాఘవ, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, సంతోష్, నర్సింహ్మారెడ్డి, ప్రగతి, సత్యకృష్ణన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సురేందర్‌రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, ఆర్ట్:సాహి సురేష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు: రామజోగ య్య శాస్ర్తీ, కృష్ణచైతన్య, అనంత్ శ్రీరామ్, నిర్మాత:ఆర్.వి.చంద్రవౌళి ప్రసాద్ (కిన్ను), స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తాతినేని సత్యప్రకాష్.

English summary
Nara Rohit starrer Shankara has almost completed its shoot. Only one song is remain to be canned. The film is an action entertainer being directed by Tatineni Satya and the film's audio is expected to release in the first half of August. R.V.Chandra Mouli Prasad is producing the film while senior producer KS Rama Rao is presenting it. The producers say they are planning to release the film by August end.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu