»   » టాక్ ఎఫెక్ట్: ‘శంకరాభరణం’ ఆ సీన్లు తీసేస్తున్నారు!

టాక్ ఎఫెక్ట్: ‘శంకరాభరణం’ ఆ సీన్లు తీసేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిఖిల్ హీరోగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ సహా నిర్మాతగా వ్యవమరించిన చిత్రం ‘శంఖరాభరణం'. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొన్ని సీన్లు బోరింగ్ ఉన్నాయని ప్రేక్షకుల నుండి ఫీడ్ బ్యాక్ రావడంతో వెంటనే చర్యలు ప్రారంభించిన దర్శకనిర్మాతలు ఆ సీన్లను తొలగించాలని నిర్ణయించారు. సినిమాను 12 నిమిషాల నిడివిని ట్రిమ్ చేస్తున్నారు.

Shankarabharanam gets trimmed

కథ విషయానికొస్తే...
తండ్రి బాగా సంపాదించడంతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే గౌతమ్(నిఖిల్). ఓ రోజు అతని తండ్రి(సుమన్) ఊహించని విధంగా పార్టనర్స్ మోసంతో బిజినెస్ లో నిండా ములిగిపోతాడు. 12 కోట్లు అర్జెంటుగా కట్టాల్సిన పరిస్దితి వస్తుంది. డబ్బులేక... ఏం చేయలో అర్దం కాక, ఆత్మహత్య చేసుకోబోతే...సమస్య తెలుసుకున్న కొడుకు గౌతమ్...బీహార్ లో ఉన్న తన తల్లి ఆస్ది శంకరాభరణం అనే బిల్డింగ్ అమ్మి , అప్పులు నుంచి బయిటపడేద్దామని ఇండియా బయిలుదేరతాడు. నిత్యం కిడ్నాప్ లతో, అందుకు సంభందించిన గ్యాంగ్ లతో కిటకిటలాడుతున్న బీహార్ లోకి ఓ ఎన్నారై అడుగుపెట్టాడని తెలియగానే వారిలో కదలిక వస్తుంది. గౌతమ్ కిడ్నాప్ చేసి కోట్లు సంపాదించాలని ఎత్తు వేసి,అమలు చేస్తారు. తన ఆస్ది అమ్ముకుని పోదామనకున్న గౌతమ్ ఉన్నట్లుండి కిడ్నాప్ కావటంతో ... ఆ కిడ్నాప్ నుంచి డబ్బు సంపాదించాలనే ఎత్తు వేస్తాడు. అక్కడ నుంచి గౌతమ్ ఏం చేసాడు...శంకరాభరణం బిల్డింగ్ ని అమ్మాడా... తన తండ్రిని సమస్యల నుంచి బయిటపడేసాడా...కిడ్నాపైన అతని పరిస్ధితి ఏమైంది, సినిమాలో అంజలి పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.


ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ. కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనం.

English summary
Shankarabharanam film now trimmed down the film by 12 minutes and removed the scenes which were acting as speed breakers to the film’s smooth flow.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu