»   » స్టేజీపై ఛార్మీ ఫుల్ హ్యాపీ,డిస్కో శాంతి కన్నీళ్లు(ఫోటో ఫీచర్)

స్టేజీపై ఛార్మీ ఫుల్ హ్యాపీ,డిస్కో శాంతి కన్నీళ్లు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : బాలీవుడ్ లో వరస హిట్స్ తో దూసుకుపోతున్న సౌత్ దర్శకుడు ప్రభుదేవా. ఆయన తాజా బాలీవుడ్‌ చిత్రం 'ఆర్‌.. రాజ్‌కుమార్‌' . ఈ సినిమా ఈ వారంలో విడుదల అవుతున్న సందర్భంగా యూనిట్‌ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌ మాదాపూర్ లో సందడి చేశారు.

  ఈ సందర్భంగా హీరో షాహిద్‌కపూర్‌, దర్శకుడు ప్రభుదేవా, నటి చార్మి ప్రమోషన్ లో భాగంగా మాట్లాడారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి ..స్టేజిపై భర్త ని తలుచుకుని బాధపడ్డారు. షాహిద్ తనకు మగధీర చిత్రం చాలా బాగుందని చెప్పారు.

  ఇక 'ఆర్‌.. రాజ్‌కుమార్‌' లో.... రాజకుమార్(షాహిద్ కపూర్) లక్ష్యం లేని కుర్రాడు. అతను డ్రగ్ లార్డ్ శివరాజ్(సోనూ సూద్) వద్ద పనిచేస్తూంటాడు. అతనికి ఓ వర్క్ శివరాజ్ అప్పచెప్తాడు. అతని రైవల్ డ్రగ్ డీలర్ మాణిక్(ఆషిష్ విధ్యార్ధి)ని చంపమని చెప్తారు. కానీ ఈ లోగా అతను ఓ అందమైన చదువుకున్న అమ్మాయి చంద(సోనాక్షి సిన్హా) తో ప్రేమలో పడతాడు. ఆమె మరెవరో కాదు..మాణిక్ మేనకోడలు. అప్పుడు హీరో..మొత్తం డ్రగ్ వ్యాపారాన్నే నాశనం చేస్తే కానీ ఈ సమస్య తీరదనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో మొత్తం వీళ్లద్దరినీ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్న అజిత్ (శ్రీహరి) తల పడాల్సి వస్తుంది. అప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

  హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ మీట్ విశేషాలు..స్లైడ్ షోలో...

  ఇక్కడ సైతం...

  ఇక్కడ సైతం...

  హిందీ సినిమాలకు ఇక్కడ మార్కెట్ కూడా బాగా పెరగటం, సౌత్ ఇండియాకు చెందిన దర్శకుడు కావటంతో ఆర్.రాజకుమార్ టీమ్ హైదరాబాద్ విచ్చేసి..ఇక్కడ ప్రమోషన్ ని సైతం భారీ ఎత్తున చేపట్టింది.

  షాహిద్ కపూర్ మాట్లాడుతూ...

  షాహిద్ కపూర్ మాట్లాడుతూ...

  ఇప్పటి వరకు చాక్లెట్‌బాయ్‌గా నటించిన నాకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగించింది. చాలా మంది నా నటనను మెచ్చుకోవడం ఆనందంగా ఉంది.

  ఇంటర్వెల్ లో దెబ్బ తగిలింది..

  ఇంటర్వెల్ లో దెబ్బ తగిలింది..


  ఇటీవలే ముంబైలో ఈ సినిమాను అందరం కలిసి చూశాం. ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళ్లిన సోనాక్షి మెట్లు దిగుతూ కిందపడింది. ఆమె కాలుకు గాయమైంది. అందుకే ఇక్కడకు రాలేకపోయింది.

  అదిరిపోయే స్టెప్ట్ లు...

  అదిరిపోయే స్టెప్ట్ లు...

  ఈ సినిమాకు ప్రభుదేవా చెప్పిన స్టెప్పులు వేసేందుకు బాగా కష్టపడాల్సి వచ్చింది. పాశ్చాత్య నృత్యం చేసే అలవాటు ఉన్న నాకు లోకల్‌బార్‌లో మాదిరిగా అదిరే స్టెప్పులను వేయించారు.

  మగధీర నచ్చింది...

  మగధీర నచ్చింది...

  నేను తెలుగు సినిమాలను కూడా చూస్తాను. మగధీర చూశాను. చాలా బాగుంది అన్నారు. ఆయన మాటల్లో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఉందన్న ఆశాభావం కనిపించింది.

  ప్రభుదేవా మాట్లాడుతూ...

  ప్రభుదేవా మాట్లాడుతూ...

  త్వరలోనే తెలుగు చిత్రసీమలోకి మళ్లీ వస్తాను. నిర్మాతల నుంచి పిలుపు వస్తే ఇక్కడ కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా. వారు ఆదరిస్తే వంద కోట్లు దాటుతామని నమ్ముతున్నా.

  చార్మి మాట్లాడుతూ....

  చార్మి మాట్లాడుతూ....

  ప్రభుదేవా దర్శకత్వంలో గతంలో కూడా సినిమాలు చేశాను. షాహిద్‌తో మొదటి సారి చేశాను. ప్రభు చెప్పిన స్టెప్పులు వేసేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది.

  ఇది శ్రీహరి చివరి చిత్రం

  ఇది శ్రీహరి చివరి చిత్రం

  డిస్కోశాంతి మాట్లాడుతూ... ఆర్‌..రాజ్‌కుమార్‌ సినిమా యూనిట్‌ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకున్న డిస్కోశాంతి మాట్లాడుతూ శ్రీహరి నటించిన చివరి చిత్రం ఇదేనన్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్త్తెన చివరి రోజునే ఆయన మరణించారంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. సహాయ నటుడిగా శ్రీహరికి ఈ సినిమాతో మరింత గుర్తింపు వస్తుందన్నారు. 15 సంవత్సరాల క్రితం తాను నృత్యం చేసిన పాటతోనే ప్రభు నృత్యదర్శకత్వం ప్రారంభం కావడాన్ని గుర్తు చేసుకున్నారు.

  English summary
  R... Rajkumar (earlier known as Rambo Rajkumar) is an upcoming Bollywood action film directed by Prabhu Deva and written by Shiraz Ahmed. Produced by Viki Rajani and Sunil Lulla, the film stars Shahid Kapoor and Sonakshi Sinha in lead roles.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more