»   » మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు సినిమాకు హీరోయిన్ ఖరారు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తెలుగు సినిమాకు హీరోయిన్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ క్రికెటర్ శ్రీశాంత్ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత సినిమా రంగంపై పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు ఫిల్మ్ మేకర్ సానా యాదిరెడ్డితో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీశాంత్ సరసన శాన్వి హీరోయిన్ గా ఖరారైంది. తెలుగులో లవ్లీ, అడ్డా చిత్రాల్లో నటించిన గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది శాన్వి.

శ్రీశాంత్ తో సినిమా చేయడంపై సానా యాదిరెడ్డి మాట్లాడుతూ...శ్రీశాంత్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్, మ్యూజిక్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. శ్రీశాంత్ మంచి బౌలరే కాదు, మంచి డాన్సర్, సింగర్ కూడా. చాలా ఫ్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసాడు. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ జీవితంపై సినిమా రాలేదు. తొలిసారి మేం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు. తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో ఈ సినిమా చేయబోతున్నాం. మూడు భాషల్లో సినిమా లాంచ్ అవుతుంది అన్నారు.

SHanvi for Sreesanth's Telugu Debut

శ్రాశాంత్ మాట్లాడుతూ..సానా యాదిరెడ్డి తో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను ఇప్పటికే సినిమాల్లో నటించినా తెలుగులో చేస్తున్న తొలి సినిమా. బాలీవుడ్లో మహేష్ భట్ గారి నిర్మాణంలో క్యాబరే అనే సినిమా చేస్తున్నాను. 2011 వరల్డ్ కప్ తర్వాత నాకు టోస్ ఆపరేషన్ జరిగిన తర్వాత క్రికెట్ ఆడలేను అని భావించాను. బెంగుళూరులో చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవాడిని. ఆ అనుభవంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. మేం చేయబోయే సినిమాలో కేవలం క్రికెట్టే కాదు... ఒక ట్రూ లవ్ స్టోరీ కూడా రన్ అవుతుంది. నాకు బాగా కనెక్ట్ అయిన కథ. దక్షిణాదిలో నాకు సబ్జెక్టు నచ్చితే మంచి రోల్స్ చేస్తాను అన్నారు.

English summary
After a lot of dilly dallying, finally the lead lady for Sreesanth's much-anticipated Telugu debut has been finalised. The lady, who bagged the golden chance is none other than Shanvi Srivastava.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu