»   » భరత్ అనే నేను సినిమాలో అతనుకూడా ఉన్నాడంట. అతని పాత్ర సస్పెన్స్ అంట!

భరత్ అనే నేను సినిమాలో అతనుకూడా ఉన్నాడంట. అతని పాత్ర సస్పెన్స్ అంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ తో పాటు ఇంకా చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు ఉన్నారు. విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నదన్న విషయం తెలిసిందే. మొదటిసారి కైరా అద్వాని ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చని అంటున్నారు సినిమా యూనిట్. మహేష్ కు పి.ఎ పాత్రలో కైరా నటించింది.

మహేష్ బాబు తండ్రిగా శ‌ర‌త్ కుమార్ నటించాడు.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ లో కానీ.. టీజ‌ర్ లో కానీ.. స్టిల్స్ లో కానీ ఎక్క‌డా శ‌ర‌త్ కుమార్ జాడ క‌నిపించ‌లేదు. కావాలనే శరత్ కుమార్ ను చూపించడం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. శరత్ కుమార్ పాత్రను సీక్రెట్ గా ఉంచి డైరెక్ట్ తెరపైన చూపించాలన్న ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది.

sharath kumar is playing kee role in bharath ane nenu film

శ్రీ‌మంతుడులో జ‌గ‌ప‌తిబాబు.. జ‌న‌తా గ్యారేజ్ లో మోహ‌న్ లాల్.. ఇలా కొరటాల సినిమాల్లో ఒక కీలక పాత్ర ఉంటుంది. అలాగే భరత్ అనే నేను సినిమాలో శరత్ బాబు పాత్ర ఉంటుందని ఇండస్ట్రి టాక్. ఈ కారెక్ట‌ర్ ను కొర‌టాల శివ ఎందుకు దాచేస్తున్నారో అర్థం కావ‌ట్లేదు. కొరటాల అతని పాత్రను ఎందుకు రివిల్ చెయ్యడం లేదో తెలియాలంటే శుక్రవారం వరుకు ఆగాల్సిందే.

English summary
Mahesh Babu's forthcoming political drama Bharat Ane Nenu, which features him in the role of a chief minister of a state, has been cleared by Central Board of Film Certification (CBFC) with U/A Certificate. a senior actor playing kee role in the film. we have to wait to know up to movie release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X