»   » షారూఖ్ కే ట్విస్ట్ ఇచ్చి 8 కోట్లు నొక్కేసాడంటే,ఆడు మామూలోడు కాదు

షారూఖ్ కే ట్విస్ట్ ఇచ్చి 8 కోట్లు నొక్కేసాడంటే,ఆడు మామూలోడు కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : షారూఖ్ ఖాన్ డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడని చెప్తూంటారు. డబ్బు విషయంలో ఆచి, తూచి అడుగు వేస్తూంటాడు. అలాంటి షారూఖ్ ఖాన్ కే ట్విస్ట్ ఇచ్చి ఎనిమిది కోట్లు నొక్కేయటం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన సంఘటన అతని జీవితంలో జరిగిందిట. ఈ విషయం గురించి షారూఖ్ స్వయంగా చెప్పారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...కొన్ని సంవత్సరాల క్రితం షారుఖ్ షారుఖ్ ఖాన్‌ను కలిసి ఓ వ్యక్తి ఓ కథ నేరేట్ చేసాడట. ఆ కథ బాగా నచ్చేసిందిట. అయితే ఆ కథ పూర్తిగా భారీ గ్రాఫిక్స్‌తో ముడిపడ్డ సబ్జెక్టు. రిస్క్ ఉన్నా కథ నచ్చడంతో తాను కూడా కో ప్రొడ్యూస్ చేయటానికి ముందుకు వచ్చాడట. ప్రి ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టమంటూ తన వాటాగా ఆ వ్యక్తికి రూ.8 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చాడట. ముందుంగా గ్రాఫిక్స్ పనులు మొదలుపెట్టబోతున్నట్లు ఆ వ్యక్తి చెప్పాడట.

ఐతే అటు వైపు నుంచి వర్క్ కు సంభందించి ఏమీ సమాచారం అందకపోవటంతో ..కొన్ని రోజుల తర్వాత ఆ పనులు ఎలా ఉన్నాయో చూద్దామని ఆ వ్యక్తి ఆఫీస్‌కు వెళ్తాడట షారూఖ్, అయితే అక్కడ అంతా ఖాళీగా కనిపించటంతో షాక్ కి గురి అయ్యాడట. అసలు ఏం జరిగిందో, తన ప్రొడ్యూసర్ ఏమైపోయాడో అని ఎంక్వైరీ చేస్తే, తనతో సినిమా తీద్దామనుకున్న నిర్మాతకు భారీ నష్టం వచ్చిందిట.

Sharuk Khan is Cheated of Rs 8 Cr

దాంతో అతను ఇప్పుడు సినిమా తీసే ఉద్దేశాన్ని కూడా మానుకున్నాడట. డబ్బుల గురించి గట్టిగా అడిగి, నిలదీస్తే కొంత టైమ్ కావాలని అడిగాడట. కానీ కొన్ని నెలల తర్వాత కూడా డబ్బులు ఇవ్వలేకపోయాడట. కొన్నాళ్లకు అతను కనిపించకుండా పోయాడట. దీంతో తాను రూ.8 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని షారుఖ్ తెలిపాడు.

అయితే ఇది షారూఖ్ స్వయంగా చెప్పాడు కాబట్టి నమ్మాల్సి వచ్చింది కానీ, లేకపోతే ఎనిమిది కోట్లు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోతే షారూఖ్ స్దాయి వ్యక్తి వదిలేయటం ఏమిటి అని బాలీవుడ్ జనం అంటున్నారు.

English summary
Shah Rukh Khan himself revealed that a film producer had cheated him of Rs 8 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu