»   » అమేజింగ్: షారుక్‌ఖాన్‌ 'ఫ్యాన్‌' కొత్త ట్రైలర్‌ (వీడియో)

అమేజింగ్: షారుక్‌ఖాన్‌ 'ఫ్యాన్‌' కొత్త ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. నేడు షారుక్‌ 50వ పుట్టిన రోజు సందర్భంగా 'ఫ్యాన్‌' ట్రైలర్‌ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది.

ఈ చిత్రం డిల్లీలో ఉండే ఆర్యన్ ఖన్నా (షారూఖ్ పాత్ర) చుట్టూతిరుగుతుంది. అతనికి గౌరవ్ అనే పెద్ద ప్యాన్ ఉంటాడు. వీరిద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. కథనం ప్రధానంగా చిత్రం ఉండనుందని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2016, ఏప్రిల్‌15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షారూఖ్‌ .. బ్యాండ్‌ బాజా బారత్‌, శుద్ద్‌ దేశీ రొమాన్స్‌' వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు మనీష్‌ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది.

Sharuk Khan's Fan Movie Teaser 2

అయితే ఈ సినిమా పేరు 'ఫ్యాన్‌' అనేది ఓ విశేషమైతే.. ఈ చిత్రంలో షారూఖ్‌.. తన ఫ్యాన్‌గా నటించడం మరో విశేషం. కాస్త వెరైటీ.. కాస్త ఆసక్తికరంగా.. మరికాస్త కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్‌ నచ్చడంతో షారూఖ్‌ ఖాన్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడని బాలీవుడ్‌ సమాచారం. మరి బాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడే షారూఖ్‌.. ఈ మూవీతో ఫ్యాన్‌గా తన ఫ్యాన్స్‌ను ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి.

English summary
On his 50th birthday, Shah Rukh Khan tweeted the second teaser of his upcoming movie Fan and we must say that it looks fabulous.The film which has been shot in Mumbai, Croatia and Delhi is about Aryan Khanna (SRK’s character in the movie) and his biggest fan, a kid called Gaurav who is obsessed with him.
Please Wait while comments are loading...